లాక్డౌన్ ఎత్తివేయడంతో షూటింగ్స్ మొదలవడం, స్టార్లంతా ఒక్కొక్కరిగా చిత్రీకరణలో జాయిన్ అయిపోవడం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ తారలు తమ ప్రాజెక్టులతో బిజీ అయిపోతున్నారు. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే రెండు సినిమాలతో బిజీ కానుంది. లేదు లేదు బిజీ అయిపోయింది. ఎందుకంటే ఈ బ్యూటీ ఎవరికి తెలియకుండానే రెండు షూటింగ్ షెడ్యూల్స్ లో పాల్గొన్నదట.
లేటెస్ట్ గా దీపికా పదుకొనే షెడ్యూల్స్ కు సంబంధించిన విషయాలు నేషనల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేయగానే సినిమా షూటింగ్స్ కు అనుమతిచ్చారు. దీపికా పదుకొనే వెంటనే సెట్స్ లో చేరిపోయింది. షారుక్ ఖాన్ తో కలిసి నటిస్తోన్న పఠాన్ షూటింగ్ ముంబైలో కొనసాగుతుండగా..దీపికా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసిందట. మరో శకున్ బత్ర డైరెక్షన్ లో చేస్తున్న సినిమాకు సంబంధించి కూడా ఒక షెడ్యూల్ ను కంప్లీట్ చేసింది.
ప్రస్తుతం దీపికాపదుకొనే పఠాన్ మూవీ మరో షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నట్టు బీటౌన్ వర్గాల టాక్. అంతేకాదు వీటితోపాటు ఫైటర్ సినిమాను కూడా మొదలుపెట్టేందుకు చర్చలు కొనసాగిస్తుందట దీపికాపదుకొనే. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
నాగశౌర్య మేనేజర్ గా వెంకట్..అతనెవరో తెలుసా..?
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
సినిమాలకు యువ హీరో గుడ్‌బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు