ముంబై, సెప్టెంబర్ 24: మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) విధానం సమగ్ర పునర్వ్యవస్థీకరణకు సై అన్నది. సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (పోర్ట్‌ఫోలియో మేనేజర్లు) రెగ్యులేషన్స్ 2026కు గురువారం సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుతమున్న 2020 రెగ్యులేషన్స్ స్థానంలో అమల్లోకి వస్తున్న ఈ మార్పులతో పీఎంఎస్ క్లెయింట్లకు పెట్టుబడి అవకాశాలు పెరుగనున్నాయి. అంతేగాక అనవసరమైన నిబంధనలు తొలగిపోనున్నాయి.
ఈ క్రమంలోనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో)లో, ప్రైమరీ మార్కెట్ డెట్ ఇష్యూల్లో పెట్టుబడులకు పోర్ట్‌ఫోలియో మేనేజర్లకు మార్గం సుగమమైంది. విస్తృత శ్రేణి విదేశీ సెక్యూరిటీలకూ లైన్ క్లియరైంది. ఇదిలావుంటే ఫిజికల్లీ సెటిల్డ్ నాన్-అగ్రికల్చరల్ కమోడిటీ డెరివేటివ్ కాంట్రాక్ట్స్‌లో పాల్గొనడానికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)ను అనుమతించాలని సెబీ నిర్ణయించింది.