RRR in Bollywood | బాహుబలి తర్వాత రాజమౌళి సినిమాలపై అన్ని ఇండస్ట్రీలలో క్యూరియాసిటీ పెరిగిందనేది కాదనలేని నిజం. అలాగే సినిమా బడ్జెట్ స్థాయితో పాటు ఇండియన్ సినిమా మార్కెట్‌ను కూడా ఈయన పెంచేశాడు. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సినిమాను 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా బిజినెస్ కూడా అదేస్థాయిలో జరిగింది. ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఏ సినిమాకు జరగనంత థియేట్రికల్ బిజినెస్ ట్రిపుల్ ఆర్కు జరిగింది. ఇదిలా ఉంటే ఎందుకో తెలియదు కానీ బాలీవుడ్లో మాత్రం ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు.
బాహుబలి 2 విడుదలకు ముందు బాలీవుడ్లో ఆ సినిమా మేనియా బాగా నడిచింది. ఎక్కడ చూసినా కూడా దాని గురించి చర్చ జరిగింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడంటూ ప్రమోషన్ పీక్స్ కు వెళ్ళింది. సినిమా విడుదలైన తర్వాత దాని కలెక్షన్స్ కూడా అలాగే వచ్చాయి. కేవలం హిందీలోనే 400 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా. అయితే అదే స్థాయి ఊపు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా విషయంలో కనిపించడం లేదు అంటున్నారు విశ్లేషకులు. తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ ఈ విషయంలో కూడా పెద్దగా జోరు కనిపించడం లేదు. ఊహించిన స్థాయిలో ఈ సినిమాకు టికెట్స్ బుక్ అవ్వడం లేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్లలో కంగారు మొదలైంది. బాహుబలి స్థాయిలో ట్రిపుల్ ఆర్ సినిమా ఉత్తరాది ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనే సరికొత్త అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి.
హిందీలో ఈ సినిమాను 92 కోట్లకు అమ్మారు. 100 కోట్ల షేర్ వస్తే కానీ సినిమా హిట్ అనిపించుకోదు. అంటే గ్రాస్ 170 కోట్లకు పైగా రావాలి. ప్రస్తుతం ఉన్న ట్రేడ్ లెక్కల ప్రకారం చూస్తే కచ్చితంగా మొదటి మూడు రోజుల్లో రికార్డు వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. కానీ అది బాహుబలి స్థాయిలో ఉండకపోవచ్చని ముందుగానే హెచ్చరిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మనకు పెద్ద హీరోలు కావచ్చు కానీ ఇందులో మాత్రం కాదు. అక్కడ కేవలం రాజమౌళి క్రేజ్ తోనే సినిమా విడుదలవుతుంది. దానికి తోడు బాహుబలి మొదటి భాగం సంచలన విజయం సాధించిన తర్వాత సెకండ్ పార్ట్ పై అంచనాలు పెరిగాయి. కానీ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కేవలం ఒకే భాగంగా వస్తుంది. దాంతో ఆ స్థాయి అంచనాలు కనిపించడం లేదు. ఏదేమైనా మార్చి 25న సినిమా వచ్చిన తర్వాత అసలు విషయం బయట పడిపోతుంది. హిందీ మాత్రమే కాదు తమిళంలో కూడా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించిన స్థాయిలో లేవు.
“RRR మొదటి రోజు టార్గెట్ 200 కోట్లు.. తగ్గేదే లే..”
SS Rajamouli | ఆర్ఆర్ఆర్కు మించి మహేశ్ సినిమా..హింట్ ఇచ్చేసిన జక్కన్న..!”
“Boycott RRR.. కర్ణాటకలో ఫ్యాన్స్ గొడవ”