RRR action choreographer | ఆర్ఆర్ఆర్లో స్టంట్ కొరియోగ్రఫర్‌గా మారిన డ్యాన్స్ మాస్టర్..ఇంతకీ ఎవరో తెలుసా..?
థియేటర్లలో ఆర్ఆర్ఆర్ (RRR) సందడికి టైం ఫిక్సయింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కో అప్డేట్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. తాజాగా ఓ ఆసక్తికర విషయం ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
థియేటర్లలో ఆర్ఆర్ఆర్ (RRR) సందడికి టైం ఫిక్సయింది. ఇంకా రెండు రోజుల్లో మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సిల్వర్ స్క్రీన్‌పై మెరువనుంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కో అప్డేట్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. తాజాగా ఓ ఆసక్తికర విషయం ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) చేసిన ఆర్ఆర్ఆర్ స్పెషల్ ఇంటర్వ్యూ (RRR Special interview) లో రాజమౌళిని యాక్షన్ కొరియోగ్రఫీ గురించి ఓ ప్రశ్న అడిగాడు. దీనికి రాజమౌళి స్పందిస్తూ..మొదట కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ (Prem Rakshith) పేరు ప్రస్తావించాడు. అదేంటి యాక్షన్ కొరియోగ్రఫీ గురించి అడిగితే డ్యాన్స్ మాస్టర్ గురించి చెప్పాడనుకుంటున్నారా..? ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటను ప్రేమ్‌రక్షిత్ మాస్టర్ కంపోజ్ చేశాడని తెలిసిందే. దీంతోపాటు సినిమాలో కొన్ని యాక్షన్ స్టంట్స్ ను కూడా ప్రేమ్‌రక్షిత్ కంపోజ్ చేశాడని చెప్పాడు జక్కన్న.

అంతేకాదు బాహుబలి 2 సినిమాలో ప్రభాస్, అనుష్కాశెట్టి మధ్య కుంతల సామ్రాజ్యంలో వచ్చే బాణం (యుద్ద సన్నివేశాలు) సీక్వెన్స్ ను కంపోజ్ చేసింది ప్రేమ్ రక్షిత్ మాస్టరేనని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ నటించగా..కొమ్రంభీంగా ఎన్టీఆర్, సీతగా అలియాభట్ నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

