Rajamouli cut out | హీరోలను మించిన క్రేజ్..ట్రెండ్ సెట్టర్ రాజమౌళికి భారీ కటౌట్
సినిమాకు క్రేజ్ పెంచేది హీరో అయితే..ఆ సినిమాను అన్నీ తానై ముందుకు నడిపించేది మాత్రం డైరెక్టర్. ఒక్క డైరెక్టర్ తలచుకుంటే ఎలాంటి గుర్తింపు లేని హీరో కూడా ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోతాడు.
సాధారణంగా హీరోహీరోయిన్లకు భారీ కటౌట్లు (massive cut outs) పెట్టి తమ అభిమానాన్ని చాటుకోవడం చేస్తుంటారు మూవీ లవర్స్.సినిమాకు క్రేజ్ పెంచేది హీరో అయితే..ఆ సినిమాను అన్నీ తానై ముందుకు నడిపించేది మాత్రం డైరెక్టర్. ఒక్క డైరెక్టర్ తలచుకుంటే ఎలాంటి గుర్తింపు లేని హీరో కూడా ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోతాడు. సినీ పరిశ్రమలో ఇలా స్టార్ హీరోగా ఫేం సంపాదించిన వాళ్లున్నారని తెలిసిందే. కానీ ఇపుడు ట్రెండ్ మారింది..
అయితే చాలా సార్లు ఎంత పెద్ద హిట్టు పడినా సినిమా సక్సెస్, క్రేజ్ ఎక్కువగా హీరోల ఖాతాలోకి వెళ్లిపోతుంది. కానీ బాహుబలి సినిమాతో ఆ ట్రెండ్ మారింది..లేదు లేదు రాజమౌళి (Rajamouli) ఆ ట్రెండ్ మార్చేశాడు..సినిమా తాలూకు సక్సెస్, క్రేజ్ హీరోలను మించి కొట్టేస్తున్నాడు జక్కన్న. అందుకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రాజమౌళి కటౌటే (Rajamouli cut out) మంచి ఉదాహరణ.

ఆర్ఆర్ఆర్ టీం (RRR) ప్రమోషన్స్ కోసం టీం ఎక్కడికెళ్లినా హీరోలతో సమానంగా అనే కంటే హీరోలను మించిన క్రేజ్ జక్కన్నకు ఏర్పడిందనేది ఎవరూ కాదనలేని విషయం. మరో రెండు రోజుల్లో ఆర్ఆర్ఆర్ థియేటర్లలో సందడి చేయబోతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సుదర్శన్ 35ఎంఎం థియేటర్ (Sudarshan 35mm) కు రాజమౌళి భారీ కటౌట్ పెట్టారు అభిమానులు.

హీరోల కటౌట్లను పక్కన పెట్టించి..ప్రతీ సినిమాకు తన కటౌట్లను థియేటర్ల ముందు పెట్టించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా..అంటే అది వన్ అండ్ ఓన్లీ రాజమౌళి మాత్రమేనని తాజా కటౌట్ చూస్తే తెలిసిపోతుంది. జక్కన్నపై అభిమానంతో ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ కటౌట్ స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
Read Also : Vidya Balan | శ్రీవల్లి పాటకు విద్యాబాలన్ డ్యాన్స్ అదిరింది..వీడియో
Read Also : Pushpa 2 plans | పుష్ప 2 షూటింగ్ షెడ్యూల్ మారిందా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

