పుష్ప (Pushpa) లోని చూపే బంగారమాయెనే శ్రీవల్లి (Srivalli Song) సాంగ్ ఇండియావైడ్‌గా ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. పుష్పరాజ్, రష్మిక (Rashmika Mandanna) డీగ్లామరైజ్డ్ పాత్రల్లో శ్రీవల్లి పాటకు వేసిన స్టెప్పులకు చిన్నా,పెద్దా తేడా లేకుండా అందరూ ఫిదా అయిపోయారు. ఈ పాటకు ఇప్పటికే క్రికెటర్లు, కొరియోగ్రాఫర్లు, స్టార్ సెలబ్రిటీలు డ్యాన్స్ చేసి అదరహో అనిపించారు. తాజాగా ఇదే పాట మరోసారి వార్తల్లో నిలిచింది.ఈ సారి బాలీవుడ్ హాట్ బ్యూటీ విద్యాబాలన్ (Vidya Balan) శ్రీవల్లి హిందీ పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేసింది.
కంప్లీట్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని శ్రీవల్లి సాంగ్‌కు డ్యాన్స్ చేసి ఔరా అనిపిస్తోంది. విద్యాబాలన్ శ్రీవల్లి డ్యాన్స్ వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. విద్యాబాలన్ ప్రస్తుతం లవర్స్ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ భామ నటించిన జల్సా సినిమా ఓటీటీలో విడుదలైంది.
ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. విద్యాబాలన్ తనకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ పై అభిమానులకు త్వరలోనే క్లారిటీఇవ్వనుంది.