RRR సినిమాకు కర్ణాటకలో కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమాను కర్ణాటకలో విడుద చేయనివ్వమని కన్నడ అభిమానులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో Boycott RRR అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా రన్ చేస్తున్నారు. ఎందుకు ఇదంతా అంటే… సినిమా దర్శకుడు మమ్మల్ని అవమానించారు అంటున్నారు. తెలుగు, తమిళం, హిందీ మళయాల భాషల్లో ఆర్ఆర్ఆర్ మూవీని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్న జక్కన్నకు కన్నడ ఫ్యాన్స్ షాకిచ్చారు. బెంగళూరులో ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతున్నది. ఇది తమకు అవమానం అంటూ అక్కడి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్ వేదికగా Boycott RRR అంటూ ప్రచారం చేస్తున్నారు.
స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల ఆధారంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీలు ముఖ్య పాత్రలు చేశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సినిమా నర్మించారు. కీరవాణి సంగీతం అందించారు. మార్చి 25న సినిమా విడుదల కానుంది.
Promise broken…. #BoycottRRRinKarnataka pic.twitter.com/NcrNUDnuwe
— Manoj Gowda (@ManojGo83410034) March 23, 2022