సారా అలీఖాన్ (Sara Ali Khan)..ఈ భామకు సోషల్‌మీడియాలో ఫాలోవర్ల సంఖ్య మామూలుగా ఉండదు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో దర్శనమిస్తూ కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటుంది సారా అలీఖాన్. అప్పడప్పుడు బీచ్ కు వెళ్లి బికినీలో ఫొటోలు దిగి నెట్టింట్లో పోస్ట్ చేస్తుంది. ఈ అమ్మడు నేటితో 26వ వసంతంలోకి అడుగుపెడుతోంది. తన పుట్టినరోజు (Birthday) ను సోదరుడు ఇబ్రహీం అలీఖాన్, స్నేహితుల సమక్షంలో జరుపుకుంది సారా.
ఇన్ స్టా రీల్స్ లో బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. 1995ల నుంచి తన లైఫ్ జర్నీని తెలియజేస్తూ త్రోబ్యాక్ స్టిల్స్ పెట్టింది. ‘సిల్వర్ జూబ్లీ పూర్తయింది. 26 సంవత్సరాల జీవనం, నవ్వడం, ప్రేమించడం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సారాకు ఇండస్ట్రీకి చెందిన మనీశ్ మల్హోత్రా, జాన్వీకపూర్, అనుష్క శర్మ, పిన్ని కరీనాకపూర్, ఆంటీ సోహా అలీఖాన్ కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
సారా అలీఖాన్ ప్రస్తుతం సాజిద్ నదియావాలా తెరకెక్కించబోయే చిత్రం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతోపాటు ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో అక్షయ్ కుమార్, ధనుష్ తో కలిసి అట్రాంగిరే చిత్రం చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్