బాలీవుడ్లో కంగనా రనౌత్, తాప్సీ మధ్య కోల్డ్‌వార్ మళ్లీ వార్తల్లోకెక్కింది. ఇప్పటికే పలుమార్లు సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించుకున్న వీళ్ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. తాప్సీపై మండిపడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఘాటుగా పోస్టు పెట్టింది కంగనా. తాను వదిలేసిన సినిమాల్లో అవకాశం కల్పించమని నిర్మాతలను బతిమిలాడుకుని ఈ రేంజ్‌కి వచ్చిందని పోస్టుపెట్టింది. నటనలో తనను తాప్సీ కాపీ కొడుతుందని.. కావాలనే తనలా కనిపించేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొంది. అంతటితో ఆగకుండా తాప్సీని బీ గ్రేడ్ నటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
అసలు వివాదం ఎలా మొదలైందంటే..తన సినిమా హసీనా దిల్ రుబా సినిమా ప్రమోషన్లో భాగంగా తాప్సీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ చిత్ర ప్రమోషన్లో ఓ రిపోర్టర్.. కంగనాను ఉద్దేశిస్తూ తాప్సీని ఓ ప్రశ్న అడిగారు. దానికి తాప్సీ ఇచ్చిన సమాధానమే ఈ గొడవకు పునాదిగా మారింది. కంగనా ట్విటర్ అకౌంట్ కొద్ది రోజుల క్రితం బ్యాన్ అయిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై ప్రశ్నించగా.. కంగనా ట్విటర్లో లేకపోవడం వల్ల తానేమీ మిస్ కావడం లేదని తాప్సీ సమాధానమిచ్చింది. కంగనాను మంచి నటిగా గౌరవిస్తా.. అంతేతప్ప తన వ్యక్తిగత జీవితంలో ఆమెకు ఎలాంటి స్థానం లేదని పేర్కొంది. ఆమె పట్ల మంచి, చెడు ఎలాంటి ఫీలింగ్ లేదని తాప్సీ చెప్పింది.
తాప్సీ చెప్పిన సమాధానంపై కంగనా రెచ్చిపోయింది. తాప్సీని బీగ్రేడ్ నటి అంటూ చులకన చేసి మాట్లాడింది. ‘నేను వదిలేసిన పాత్రలు ఇవ్వమని నిర్మాతలను తాప్సీ బతిమిలాడుకుంది. నన్ను కాపీ కొట్టి ఈ స్థాయికి వచ్చింది. అయినా నా పేరు వాడుకొని ఎవరైనా ఎదగాలనుకుంటే నాకు అభ్యంతరం లేదు’ అంటూ ఘాటుగా స్పందించింది. అయితే కంగనా వ్యాఖ్యల నేపథ్యంలో నెటిజన్లు తాప్సీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక్కడ తాప్సీ మాట్లాడిన దాంట్లో తప్పేముంది.. కంగనా ఎందుకు ఆమెను అలా చులకన చేసి మాట్లాడిందంటూ కామెంట్లు పెడుతున్నారు. తాప్సీ తన నిర్ణయం తాను చెప్పింది.. అందులో తప్పేం లేదు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ షాకింగ్ లుక్స్.. చిత్రాలు
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?