రజనీకాంత్ తో ఈ ఫోటోలో ఉన్న సూపర్ స్టార్ ఎవరో తెలుసా..?
రజనీకాంత్ | సూపర్ స్టార్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇందుకు కారణం రజనీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడమే.
By Maduri Mattaiah

సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇందుకు కారణం రజనీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడమే. 51వ దాదా సాహెబ్ ఫాల్కె అవార్డును కేంద్ర ప్రభుత్వం రజనీకాంత్ కు ఇస్తున్నట్లు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రెటీలు రజినీతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.
సూపర్ స్టార్ అనేది పేరు కాదు ఒక చరిత్ర.. ఈయన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు.. గ్రంథాలు కావాలి. ఎక్కడో ఒక చిన్న బస్ కండక్టర్ స్థాయి నుంచి ఈ రోజు ఇండియన్ సినిమాలో ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక స్థానం సృష్టించుకునే వరకు రజినీ ప్రతి అడుగు ఒక సంచలనం. ఆయన అభిమానులకు అది మార్గదర్శకం. 46 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు రజినీకాంత్. ఈ కీర్తి కిరీటంలో ఇప్పుడు దాదా సాహెబ్ ఫాల్కే కూడా వచ్చి చేరిపోయింది. సినిమా ఇండస్ట్రీలో అత్యున్నత అవార్డు ఇది.
70ఏళ్ల రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. 46 ఏళ్లుగా ఆయన కెరీర్ నిర్విరామంగా అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇంత అనుభవం ఉన్న రజనీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై ఎంతో మంది స్పందించారు. తాజాగా ఒక ఇండియన్ సూపర్ స్టార్.. రజనీకాంత్ తో చిన్నప్పుడు దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆయన గట్టిగా హత్తుకున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. అతను ఎవరో కాదు సూపర్ హీరో హృతిక్ రోషన్.
రజనీకాంత్ కు బాలీవుడ్లో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. ఆయన హిందీలోనూ చాలా సినిమాల్లో నటించాడు. ఆ సమయంలోనే హృతిక్ రోషన్‌తో దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. మీ గొప్పతనం గురించి చిన్నప్పట్నుంచి వింటున్నాను.. అలాగే మీరు రోజురోజుకు ఎదగడం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.. అంటూ రజనీకాంత్ గురించి పోస్ట్ చేశాడు హృతిక్ రోషన్. ప్రస్తుతం ఈ ఇద్దరు సూపర్ హీరోస్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
శూలంతో పవన్‌కల్యాణ్ కసరత్తులు..ఫొటోలు హల్చల్
రికార్డు స్థాయి థియేటర్లలో వకీల్ సాబ్ రిలీజ్
పీపుల్ మీడియాతో పవన్‌కల్యాణ్ భాగస్వామ్యం
అందంతో మాయ చేస్తున్న రాయ్‌లక్ష్మీ..స్టిల్స్ హల్చల్
కోవిడ్ టీకా తీసుకున్న మలైకా అరోరా
నాగార్జున కోసం చిరు వంట..ట్రెండింగ్‌లో స్టిల్
మెగా మేనల్లుడి మూడో చిత్రం షురూ..
అలియాభట్‌కు కరోనా పాజిటివ్
వకీల్ సాబ్ : పవన్ కళ్యాణ్ గురించి అంజలి ఏమన్నదంటే..
వైష్ణవ్ తేజ్ కోసం క్యూ కడుతున్న దర్శకులు
సల్మాన్ ఖాన్ ‘రాధే’ కు నో సెన్సార్ కట్స్
ఆ వార్త నిజం కాదు..విజయ్ సినిమాపై బాలీవుడ్ హీరో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

