ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు అంతా. ఇప్పుడు కూడా అలాంటి చేదు వార్తే బయటికి వచ్చింది. తాజాగా ప్రముఖ కమెడియన్ మరణించాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న తమిళ కమెడియన్ తేపట్టి గణేశన్ కన్నుమూశాడు.
గణేశన్‌కు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగుండటం లేదంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఆయన్ని మధురైలోని రాజాజీ హాస్పిటల్లో చేర్పించారు.
అక్కడే కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నాడు ఈయన. అయితే ఉన్నట్లుండి ఆరోగ్యం విషమించడంతో మార్చి 22న ఈయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
అనారోగ్యానికి తోడు గుండెపోటు రావడంతో గణేశన్ మరణించినట్లు తెలుస్తుంది.
எனது படங்களில் நடித்து வந்த சிறந்த நடிகன் தம்பி கார்த்தி என்ற தீப்பெட்டி கணேசன் உடல்நலக்குறைவு காரணமாக மதுரை இராஜாஜி அரசு மருத்துவமனையில் காலமான செய்தி கேட்டு உள்ளம் கலங்கினேன்.அன்புநிறை
— R.Seenu Ramasamy (@seenuramasamy) March 22, 2021
இதய அஞ்சலி கணேசா.. pic.twitter.com/TWQIHHgElt
గణేశన్ మరణాన్ని తమిళ దర్శకుడు శ్రీను రామస్వామి కన్ఫర్మ్ చేశాడు. గణేశన్ మరణవార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
చాలా చిన్న వయసులోనే ఆయన కన్నుమూయడం తమిళ ఇండస్ట్రీకి తీరనిలోటు అంటూ ట్వీట్ చేశాడు.
ఈ విషాద వార్త తెలిసిన తర్వాత ఆయనతో పని చేసిన నటీనటులు కూడా విషాదంలో మునిగిపోయారు.
అద్భుతమైన నటున్ని ఇండస్ట్రీ కోల్పోయింది అంటూ సంతాపం తెలియచేశారు తమిళ ప్రముఖులు. ఈయనకు కార్తి అనే మరో పేరు కూడా ఉంది.
పవన్ సినిమా హిట్ అయితేనే బన్నీ అతడికి ఛాన్స్ ఇస్తాడా?
‘జాతి రత్నాలు’ కలెక్షన్స్.. జోగిపేట్ కుర్రాళ్లు తగ్గట్లేదు
కరోనా రెండో దశ వచ్చిందా.. ఇండస్ట్రీ పరిస్థితేంటి?
నవీన్ పొలిశెట్టికి వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ
అక్కడ స్టార్ హీరోలు.. మన భాషలో సూపర్ విలన్స్
తమన్నా ఇంటిని చూస్తారా.. ఇంధ్రభవనం కూడా తక్కువే..
పవన్ సినిమాతో విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ ఓపెనింగ్
అమాంతం రేటు పెంచిన జాతిరత్నం.. పర్లేదు అంటున్న నిర్మాతలు