మ్యూజిక్ లవర్స్ ప్రస్తుతం తెగ ఎంజాయ్ చేస్తున్న పాటేదైనా ఉన్నదంటే..ఠక్కున చెప్పేది ఆర్ఆర్ఆర్ (RRR) మాస్ బీట్ గురించే. ‘నా పాట చూడు..నా బాట చూడు..(Naatu Naatu Song)‘ అంటూ ఆర్ఆర్ఆర్ నుంచి మేకర్స్ ఇటీవలే విడుదల చేసిన పాట ఇపుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. వ్యూస్ పంట పండిస్తోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ మాస్ బీట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే స్పూప్ డ్యాన్స్ వీడియోలు కూడా చేస్తూ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు.
నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు..నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు పాటలో రాంచరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr NTR) ఊర మాస్ రేంజ్లో స్టెప్పులేసి అదరగొట్టారు. తాజాగా ఇదే పాటకు ఓ బైకర్ (Biker Naatu Naatu Dance) అదిరిపోయే స్టెప్పులేసి అందరినీ కట్టిపడేస్తున్నాడు. ఓ ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ దగ్గర రెడ్ లైట్ పడగానే వాహనాలన్నీ ఆగిపోయాయి. ఓ బైకుపై ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ పెట్టుకుని సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగారు.
Maaaasss 💥💥💥 #RRRMassAnthem #RRRMovie https://t.co/m46OnGPtAN
— RRR Movie (@RRRMovie) November 14, 2021
ఇంతలోనే బైకుపై కూర్చొన్న రెండో వ్యక్తి కిందికి దిగి నాటు నాటు సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ టీం అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేసింది. స్టైలిష్‌గా చేసిన ఈ డ్యాన్స్ వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అయితే బైకర్ డ్యాన్స్ చేసిన ఏరియా ఎక్కడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. రానున్న రోజుల్లో ఆర్ఆర్ఆర్ సాంగ్ క్రేజ్ ఇంకా ఏ రేంజ్‌కు వెళ్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Upasana: పిల్లల గురించి ఉపాసనకు ప్రశ్న.. సమాధానం ఏంటంటే..!
Upasana Surprise| ఉక్రెయిన్ లో ఉపాసన సర్ప్రైజ్..పోస్ట్ వైరల్
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి