Bigg boss 5 telugu season | బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడూ అనుకున్నది జరగదు.. ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. అందుకే అది బిగ్ బాస్ హౌస్ అయింది. అక్కడ ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి టాస్క్ ఇస్తారో ఊహించడం కూడా కష్టమే. ఇప్పుడు కూడా ఇలాంటి టాస్క్ ఒకటి జరుగుతుంది. ఈ టాస్క్‌లో భాగంగా ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు మొత్తం తీసుకెళ్లిపోయారు. కనీసం పండ్లు కూడా ఇంటి సభ్యులకు ఇవ్వడం లేదు. టాస్క్‌లో గెలవాలంటే బరువు తగ్గాల్సిందేనని మెలిక పెట్టాడు బిగ్ బాస్. దాంతో కడుపు పట్టుకొని ఆకలితో అటు ఇటు చూస్తున్నారు కంటెస్టెంట్స్. కొందరు ఆకలికి తట్టుకోలేక కేకలు కూడా వేస్తున్నారు. నిజంగా బిగ్ బాస్ ఇంట్లో ఇలాగే ఉంటుందా అనే అనుమానాలు అందరికీ వస్తున్నాయి.
ఒక రోజు నుంచి ఇంట్లో ఎవరికీ ఫుడ్ లేదు. పైగా టాస్కులు కూడా ఇస్తున్నాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్‌లో కొందరికి ఆరోగ్యం బాగోలేదు.. అందుకే వాళ్లు మధ్యలో వచ్చిన ఫుడ్ తినేస్తున్నారు. లోబో లాంటి వాళ్లు అయితే ఏకంగా చెత్త బుట్టలో చేయి పెట్టి అక్కడ ఏం దొరుకుతుందా అని చూస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి వైరల్ అవుతుంది. అన్నం విలువ ఇప్పుడు తెలుస్తుంది.. ఆకలి బాధలు ఎలా ఉంటాయో ఇప్పుడు అర్థం అవుతున్నాయి అంటూ యాంకర్ రవి మాట్లాడుతుంటే ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. మరోవైపు మిగిలిన వాళ్లు కూడా కేవలం ప్రోటీన్స్, కొబ్బరి నీళ్లతో కడుపు నింపుకుంటున్నారు. ఈ టాస్క్ అయిపోయే వరకు కంటెస్టెంట్స్ కడుపు కాలడం ఖాయం. అది ఎన్ని రోజులు ఉంటుంది అనేది బిగ్ బాస్ ఇష్టం.. ఎందుకంటే అదే అక్కడ సిస్టం. మొత్తానికి బిగ్ బాస్ ఇంట్లో ఫుడ్ కోసం పెద్ద యుద్ధమే జరుగుతుంది. మరి దీనికి ముగింపు ఎప్పుడు ఉందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Dil Raju | సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దు: దిల్ రాజు
ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
‘మా’ రాజకీయ వేదిక కాదు.. ప్రకాశ్ రాజ్‌పై నరేశ్ ఫైర్
తగ్గేదే లే.. క్యూట్ లుక్స్‌తో కేక పెట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్ 5 తెలుగులో తొలిసారి అబ్బాయి ఎలిమినేట్ కాబోతున్నాడా..?
మోహన్ బాబును దొంగ నా కొడుకు అని తిట్టిన స్టార్ హీరో ఎవరు..?