శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 21:00:28

బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీళ్లే

బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీళ్లే

క‌రోనా మ‌హ‌మ్మారితో స‌త‌మ‌త‌మవుతున్న తెలుగు ప్ర‌జ‌ల‌కు వినోదాన్ని అందించేందుకు బిగ్ బాస్ సీజన్ 4తో ముందుకొచ్చాడు. ప్రేక్ష‌కులు లేకుండా మొద‌లైన ఈ బిగ్ బాస్ సీజ‌న్-4 లో నాగార్జున తండ్రి పాత్రలో  స‌రికొత్త‌గా క‌నిపించాడు. ఇక బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొనే కంటెస్టంట్లు ఎవ‌ర‌నే విషయంపై ఉన్న స‌స్పెన్స్ కు తెర‌ప‌డింది. బిగ్ బాస్ సీజ‌న్ 4లో వినోదాన్ని అందించేందుకు సిద్ద‌మ‌వుతున్న వారి వివ‌రాలు..

బిగ్ బాస్ కంటెస్టెంట్ల వివ‌రాలు: 


మొద‌టి కంటెస్టంట్ గా టాలీవుడ్ న‌టి మోనాల్ గజ్జ‌ర్ మొద‌టి కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాలి సినిమాలో న‌టించింది. 

ప్ర‌ముఖ ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు సూర్య‌కిర‌ణ్ రెండో కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చారు. 2002లో స‌త్యం సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. 


మూడో కంటెస్టంట్ గా లక్ష్మీప్ర‌స‌న్న లాస్య ప్రియాంక రెడ్డి అలియాస్ లాస్య బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. లాస్య ప‌లు టీవీ షోల‌కు యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. 


నాలుగో కంటెస్టంట్ గా అభిజిత్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హైద‌రాబాదీ అయిన అభిజిత్‌ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో సినీ ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించాడు. ఆ త‌ర్వాత మిర్చీ లాంటి కుర్రాడు, రామ్ లీలా వంటి చిత్రాల్లో న‌టించాడు. పెళ్లి గోల అనే వెబ్‌సిరీస్ లో న‌టిస్తున్నాడు.

 

ఐదో కంటెస్టంట్ గా జోర్దార్ సుజాత బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టింది.