ప్రధాని నరేంద్రమోదీతో ఆర్మీ చీఫ్ నరవానె భేటీ
PM with Army chief: ప్రధాని నరేంద్రమోదీ వివిధ రంగాల వారితో కరోనా పరిస్థతిపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే వైద్యరంగ ప్రముఖలతోపాటు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా విస్తరిస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ వివిధ రంగాల వారితో కరోనా పరిస్థతిపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే వైద్యరంగ ప్రముఖలతోపాటు, ఫార్మా పరిశ్రమ నిపుణులతో చర్చించిన ఆయన, ఇటీవల సీడీఎస్ బిపిన్ రావత్, ఎయర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బౌదరియాతో కూడా కరోనా కట్టడిపై చర్చించారు.
తాజాగా ఈ మధ్యాహ్నం ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవానెతో కూడా ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆర్మీ ఇప్పటికే పోషిస్తున్న, ఇకపై పోషించాల్సిన పాత్ర గురించి ఈ సందర్భంగా చర్చించారు. కరోనా సోకిన సాధారణ పౌరులకు చికిత్స కోసం ఆర్మీ ఆస్పత్రులను తెరువాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ వివరాలను ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం మీడియాకు వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
నమ్మలేని నిజం: భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెండ్లి చేసిన భర్త..!
రష్యా నుంచి భారత్‌కు రెండు విమానాల్లో భారీగా వైద్య సామాగ్రి
టీకా కోసం 1.23కోట్ల రిజిస్ట్రేషన్లు
ఊసరవెళ్లిలా రంగు మారుతున్న మహిళ చేతివేళ్లు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirmal | నిర్మల్‌లో జనసునామీ దద్దరిల్లిన రైతుగర్జన సభ.. కేటీఆర్ ప్రసంగంతో అందరిలో ఉత్సాహం
Financial Crisis | ఖజానా ఖాళీ పైసల్లేవ్.. భూనిర్వాసితులకు పరిహారం ఇవ్వలేం
Qualcomm Layoffs | ఆగని ఉద్యోగ కోతలు.. క్వాల్కామ్, పెప్సీకోలో భారీగా లే ఆఫ్‌లు
Horoscope | 12-11-2026 గురువారం.. మీ రాశి ఫలాలు
కమీషన్ ఇస్తేనే లోన్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

