కొవాగ్జిన్‌కు అమెరికా కితాబు
- కరోనా బీ.1.617 రకాన్ని సమర్థంగా నిస్తేజపరుస్తున్నదని వెల్లడి
- మీడియాకు వివరించిన అధ్యక్షుడి వైద్య సలహాదారు ఆంథోని ఫౌచీ

వాషింగ్టన్, ఏప్రిల్ 28: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ సామర్థ్యాన్ని అమెరికా అధ్యక్షుడి వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోని ఫౌచీ ప్రశంసించారు. భారత్‌లో రెండుసార్లు ఉత్పరివర్తనాలకు లోనైన (డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్) కరోనా వైరస్ తాలూకు బీ.1.617 రకాన్ని కొవాగ్జిన్ సమర్థవంతంగా నిస్తేజపరుస్తున్నదని తెలిపారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత అంటువ్యాధుల నిపుణుడిగా కూడా పేరున్న ఫౌచీ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘భారత్‌లో కరోనా తీవ్రతకు సంబంధించి రోజువారీ సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం. తాజా సమాచారం ప్రకారం.. కొవాగ్జిన్ తీసుకున్న వారిలో వైరస్ బీ.1.617 రకాన్ని టీకా సమర్థవంతంగా నిస్తేజపరుస్తున్నట్లు గుర్తించాం.
భారత్‌లో ఆందోళనకర పరిస్థితులున్నప్పటికీ.. వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది వైరస్‌ను ఎదుర్కొనే సమర్థవంతమైన ఆయుధమని దీని ద్వారా తెలుస్తున్నది’ అని ఫౌచీ పేర్కొన్నారు. మరోవైపు, అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక మంగళవారం కొవాగ్జిన్‌కు సంబంధించి ఒక వార్తను ప్రచురించింది. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలను తయారుచేయమంటూ రోగ నిరోధక వ్యవస్థను కొవాగ్జిన్ ప్రేరేపిస్తుందని ఈ వార్తలో వివరించింది. సంక్షోభంలో ఉన్న భారత్‌కు అమెరికా నుంచి ఇప్పటికే ఒక నిపుణుల బృందం బయల్దేరిందని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

