e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News న‌మ్మ‌లేని నిజం: భార్య‌ను ప్రియుడికి ఇచ్చి పెండ్లి చేసిన భ‌ర్త‌..!

న‌మ్మ‌లేని నిజం: భార్య‌ను ప్రియుడికి ఇచ్చి పెండ్లి చేసిన భ‌ర్త‌..!

న‌మ్మ‌లేని నిజం: భార్య‌ను ప్రియుడికి ఇచ్చి పెండ్లి చేసిన భ‌ర్త‌..!

ప‌ట్నా: హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్‌..! 1999లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా. సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమా ద‌ర్శ‌కుడు. అజ‌య్ దేవ‌గ‌న్‌, ఐశ్వ‌ర్యారాయ్‌, స‌ల్మాన్‌ఖాన్ ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లు షోషించారు. ఈ సినిమా క‌థ గుర్తుందా..? అందులో అజయ్ దేవ్‌గన్ పోషించిన పాత్రను నిజ జీవితంలో చూడలేమని అనుకుంటాం. ఎందుకంటే ఏ భర్త కూడా తన భార్యను ఆమె ప్రియుడితో క‌లిపి పంపాల‌ని అనుకోడు.

అయితే, ఈ చిత్రం విడుదలైన‌ 22 సంవత్సరాల తరువాత ఇప్పుడు స‌రిగ్గా ఆ సినిమా క‌థ‌ను పోలిన ఘ‌ట‌న నిజం జీవితంలో జ‌రిగింది. బీహార్ రాష్ట్రం భాగల్పూర్ జిల్లా సుల్తాన్‌గంజ్ న‌గ‌రానికి చెందిన ఓ వ్య‌క్తి ఏడు సంవ‌త్స‌రాలు త‌న‌తో క‌లిసి కాపురం చేసిన భార్య‌ను ఆమె ప్రియుడికి ఇచ్చి వివాహం చేశాడు. అలాగ‌ని అత‌డేదో బండరాయి లాంటి మ‌నుసున్న మ‌నిషి అనుకుంటే పొర‌పాటే. అత‌నికి భార్య అంటే గుండెల నిండా ప్రేమ‌. అయినా త‌న మ‌న‌సు చంపుకుని భార్య ప్రేమ‌ను గెలిపించాడు.

న‌మ్మ‌లేని నిజం: భార్య‌ను ప్రియుడికి ఇచ్చి పెండ్లి చేసిన భ‌ర్త‌..!

వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్ రాష్ట్రం ఖగారియా జిల్లాకు చెందిన సప్న కుమారి అనే యువ‌తి 2014లో సుల్తాన్‌గంజ్‌కు చెందిన ఉత్తమ్‌ మండల్‌ను వివాహం చేసుకుంది. ఆ త‌ర్వాత కొన్నేండ్లు వారి జీవితం సంతోషంగానే గ‌డించింది. ఇంత‌లో స‌ప్న‌కు ఉత్త‌మ్ బంధువు రాజుకుమార్ ప‌రిచ‌య‌మ‌య్యాడు. రాజుకుమార్ వ‌య‌సులో స‌ప్న కంటే చాలా చిన్న‌వాడు అయినా వారి ప‌రిచ‌యం క్ర‌మంగా వివాహేత‌ర సంబంధానికి దారితీసింది. ఇద్ద‌రి ఇండ్లు ఓకే కాల‌నీలో కావ‌డంతో ఉత్త‌మ్ మండ‌ల్ కంట‌ప‌డే వ‌ర‌కు వారి ప్రేమాయ‌ణం కొన‌సాగుతూ వ‌చ్చింది.

భార్య రాస‌లీల‌లు క‌ళ్లారా చూసిన ఉత్త‌మ్ మండ‌ల్ ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యాడు. మాన‌సికంగా వేద‌న అనుభ‌వించాడు. అప్ప‌టికే వారి వివాహం జ‌రిగి ఏడు సంవ‌త్స‌రాలు. ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. దాంతో రాజుకుమార్‌తో సంబంధం మానుకొమ్మ‌ని స‌ప్న‌కు న‌చ్చ‌జేప్పే ప్ర‌య‌త్నం చేశాడు. అయినా ఆమె ప‌ట్టంచుకోలేదు. దాంతో అప్ప‌టిదాకా అన్యోన్యంగా ఉన్న దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి.

న‌మ్మ‌లేని నిజం: భార్య‌ను ప్రియుడికి ఇచ్చి పెండ్లి చేసిన భ‌ర్త‌..!

ఇక భార్య‌కు న‌చ్చ‌జెప్ప‌డం త‌నవ‌ల్ల కాద‌నుకున్న ఉత్త‌మ్ మండ‌ల్ త‌న త‌ల్లిదండ్రులకు, అత్త‌మామ‌ల‌కు విష‌యం చెప్పాడు. దాంతో వాళ్లు కూడా సంసారాన్ని పాడు చేసుకోవ‌ద్దని, ప‌సిపిల్ల‌ల బ‌తుకుల‌ను ఆగం చేయొద్దని స‌ప్న‌కు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయినా స‌ప్న వారి మాట‌ల‌ను వినిపించుకోలేదు. పైగా తాను రాజుకుమార్ లేకుండా బ‌తుక‌లేన‌ని తెగేసి చెప్పింది.

దాంతో చేసేది లేక ఉత్త‌మ్ మండ‌ల్ త‌న భార్య ప్రేమ‌ను అంగీక‌రించాడు. స‌ప్న త‌న‌కు డైవోర్స్ ఇచ్చి రాజుకుమార్‌ను పెండ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడు. అనంత‌రం త‌మ ఇంటి స‌మీపంలోని దుర్గా ఆల‌యంలో వివాహ వేడుక‌కు ఏర్పాట్లు చేసి, త‌న త‌ల్లిదండ్రులు, అత్త‌మామ‌ల స‌మ‌క్షంలో రాజుకుమార్‌, స‌ప్న‌ల వివాహం జ‌రిపించాడు. ఆ త‌ర్వాత సంతోషంగా జీవితం గ‌డ‌పండి అని వారిని అశీర్వ‌దిస్తూనే తాను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న భార్య దూర‌మైంద‌న్న బాధ త‌ట్టుకోలేక‌ విల‌పించాడు.

న‌మ్మ‌లేని నిజం: భార్య‌ను ప్రియుడికి ఇచ్చి పెండ్లి చేసిన భ‌ర్త‌..!

కానీ, స‌ప్న మాత్రం సంతోషంగా త‌న ప్రియుడిని పెండ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఆమె త‌న‌ భ‌ర్త‌ను మాత్ర‌మే కాదు, న‌వ‌మాసాలు మోసి క‌న్న త‌న ఇద్ద‌రు పిల్ల‌లను కూడా భ‌ర్త ద‌గ్గ‌రే వ‌దిలేసింది. కాగా, భ‌ర్తే భార్య‌కు వివాహం చేస్తున్నాడ‌ని తెలిసి స్థానికులు భారీ సంఖ్య‌లో గుడికి వెళ్లి వివాహాన్ని వీక్షించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి

ర‌ష్యా నుంచి భార‌త్‌కు రెండు విమానాల్లో భారీగా వైద్య సామాగ్రి

కోలుకున్న కేసీఆర్‌

కొవాగ్జిన్‌కు అమెరికా కితాబు

టీకా కోసం 1.23కోట్ల రిజిస్ట్రేషన్లు

ఊస‌ర‌వెళ్లిలా రంగు మారుతున్న మ‌హిళ చేతివేళ్లు..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
న‌మ్మ‌లేని నిజం: భార్య‌ను ప్రియుడికి ఇచ్చి పెండ్లి చేసిన భ‌ర్త‌..!

ట్రెండింగ్‌

Advertisement