సిద్దిపేట, మే 27( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరు మున్నీరవుతుంటే.. ఈ మంత్రులు ఎక్కడా ఉన్నారు. ..? రైతుల బాధలు మంత్రులకు పట్టవా..? సీఎం, మంత్రులు స్పందించి కలెక్టర్లు, తహసీల్దార్లు, డీఆర్డీఏ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి, తడిసిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రైతులెవరూ అధైర్యపడవద్దని ..మీకు అండగా ఉండి ప్రభుత్వంపై కొట్లాడి తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేలా చేస్తామని హరీశ్‌రావు అన్నారు.
బుధవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు గోనపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులను ఓదార్చారు.అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ .. ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనకపోవడంతో వానకు వడ్లు తడిసి ముద్దయినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్‌మిల్లర్లు బస్తాకు 43 కిలోలు పెడితేనే దించుకుంటామని, లేకపోతే మిల్లుల దగ్గరకు రావద్దని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అననారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్తే మీరే మిల్లర్లతో మాట్లాడుకోండని చేతులెత్తేస్తున్నారని చెప్పారు. ఏ-గ్రేడ్ వడ్లను కూడా బీ-గ్రేడ్ కిం ద రాస్తూ ఎకరాకు రూ. 6,700, , క్వింటాల్‌కు 3 నుంచి 5 కిలోల తరుగు పేరుతో మరో రూ. 3000, వెరసి ఒకో రైతు రెండు రకాలుగా వేలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రవా ణా ఛార్జీలు, హమాలీ ఛార్జీలు, ట్రాక్టర్ల వెయిటింగ్ ఛార్జీలు, కాంటా డబ్బులు అన్నీ రైతుల నెత్తినే రుద్దుతూ ప్రభుత్వం పూర్తిగా రై తు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.బక్రీద్ పండుగ వస్తుండడంతో లారీ డ్రైవర్లు దొరకరని, ప్రభుత్వం వారం రోజుల పాటు ఇసుక తవ్వకాలను, రవాణాను ఆపివేసి వేలాదిగా ఉన్న ఆ ఇసుక లారీలను, ఆర్టీ ఏ అధికారులను వడ్ల రవాణాకు కేటాయించాలని కోరారు. ప్రభుత్వానికి రైతులు ము ఖ్యమా? ఇసుక మీద వచ్చే ఆదాయం ము ఖ్యమా? తేల్చుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వాలు…
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలను విస్మరించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని హరీశ్‌రావు మండిపడ్డారు. వడ్లు, మకలు, సన్ ఫ్లవర్, శనగలు, జొన్నలు కొనమంటే కాంగ్రెస్ నాయకులు కేంద్రం మీద నెపం నెడుతున్నారని, మరోవైపు బీజేపీ వాళ్లు వడ్లు కొనాలని ఇకడ ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయని ఇకడ కాంగ్రెస్ వాళ్లు రోడ్డెకుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ లెవీ కోటాను, ఎరువుల కోటాను రాష్ట్రానికి సకాలంలో ఇవ్వకుండా బీజేపీ మోసం చేస్తుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ సరార్ రైతులను గాలికి వదిలేసి ఇద్దరూ కలిసి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.
బీజేపీ ఎంపీలు ఇకడ ధర్నాలు చేయడం కాదని.. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కోటా పెంచేలా కొట్లాడాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆనాడు కేంద్రం కోటా ఇవ్వనప్పుడు కేసీఆర్ మంత్రులతో సహా ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశామని గుర్తు చేశారు. సన్ ఫ్లవర్, జొన్నలు, శనగలు కేంద్రం కొనకపోయినా రైతులు నష్టపోవద్దని రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోనే కేసీఆర్ కొనుగోలు చేశారన్నారు. ఇప్పుడు రెండు నెలలుగా సన్ ఫ్లవర్ కొనకపోవడంతో చెదలు పడుతోందన్నారు. కనీసం గన్నీ బ్యాగులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని మండి పడ్డారు. వానకాలం వస్తున్నా ఇంతవరకు జీలుగ, జను ము విత్తనాలు, ఎరువుల స్టాక్ రెడీ చేసుకోలేదన్నారు. వ్యవసాయం, రైతులు ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యతాంశంగానే లేవని హరీశ్‌రావు విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వంతో ఏనాడూ ఇబ్బంది రాలేదు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎరువులకు, వడ్ల కొనుగోళ్లకు ఏనాడూ ఇబ్బంది రాలేదని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఆనాడు కేసీఆర్ కాళేశ్వరం జలాలతో బంగారం లాంటి పంటలు పండిస్తే.. ఇవాళ కొనేవాడు లేక ఆ పంట అమ్ముకోవడం రైతులకు కష్టమైపోయిందని అన్నారు. సాధారణంగా రోహిణీ కార్తె నాటికి వడ్ల కొనుగోళ్లు పూర్తవుతాయని, కానీ.. ఈ ప్రభుత్వం ఆన్లైన్ ట్యాగింగ్, కొత్త రూల్స్ పేరుతో నెల రోజులు కాలయాపన చేయడం తో నేడు ఈ దుస్థితి దాపురించిందని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో 80శాతం వడ్లు కొన్నామని సీఎం రేవంత్ హైదరాబాద్‌లో ఏసీ రూముల్లో కూర్చుని చెబితే నిజాలు తెలియవన్నారు. ఏ మారెట్ కి పోయినా ఇంకా సగం ధాన్యం కల్లాల్లోనే ముగ్గుతోందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ, నాయకులు రాజనర్సు, మాణిక్యరెడ్డి, కాముని శ్రీనివాస్, పాప య్య. ఆంజనేయులు, శ్రీనివాస్ తదితర నాయకులు ఉన్నారు.