టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) కొరటాల శివ (Koratala Siva) క్రేజీ కాంబోలో వస్తున్న ప్రాజెక్టు ఆచార్య (Acharya). ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ సినిమా నుంచి భలే భలే బంజారా పాట (Bhale Bhale Banjara Song) ప్రోమోను రిలీజ్ చేయగా..మంచి స్పందన వస్తోంది. తాజాగా మేకర్స్ ఫుల్ లిరికల్వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ సాంగ్‌లో చిరంజీవి, రాంచరణ్ (Ram charan0 ఒకరిని మించి మరొకరు తమ తమ స్టైల్స్ లో పోటీపడి మరి డ్యాన్స్ చేసినట్టు లేటెస్ట్ వీడియోతో అర్థమవుతుంది. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను లెజెండ్ సింగర్ శంకర్ మహదేవన్, టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు.
ఈ ప్రాజెక్టులో కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. సిద్ధ పాత్రలో రాంచరణ్ కనిపించనున్నాడు. రాంచరణ్‌కు జోడీగా నీలాంబరి పాత్రలో పూజాహెగ్డే నటిస్తోంది. మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన అన్ని పాటలకు అద్బుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.