Bhagyashri Borse | రవితేజ టైటిల్ రోల్ పోషిస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వబోతుంది పూణే సుందరి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse). హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ విడుదల కానుంది. కాగా తెలుగులో తొలి సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో దేవుడికి పూజలు చేసి ఆశీస్సులు అందుకుంది.
సంప్రదాయ చీరకట్టులో నెత్తిన మల్లెపూలు పెట్టుకొని అందానికే అసూయ పుట్టేలా ఉన్న భాగ్యశ్రీ బోర్సే విజువల్స్, స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మోడ్రన్ డ్రెస్‌లో, చీరకట్టులో హొయలుపోతూ తెలుగు ప్రేక్షకుల మతులు పోగోడుతోంది. ఇప్పటికే రవితేజ, భాగ్య శ్రీ బోర్సే కాంబోలో విడుదలైన సితార్, రెప్పల్ డప్పుల్ సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
తొలి సినిమా విడుదల కాకముందే విజయ్ దేవరకొండ VD12, దుల్కర్ సల్మాన్ సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసిందని ఇప్పటికే నెట్టింట వార్తలు వస్తున్నాయి.
#BhagyashriBorse 🩵😘#BhagyashriBorse #MrBachchan #Tollywood #Bollywood #Filmify #Filmifytelugu pic.twitter.com/VlYk0ZW9yu
— Filmify Official (@FilmifyTelugu) July 28, 2024

Bhagyashri Borse1

Kubera | బర్త్ డే స్పెషల్.. ధనుష్ కుబేర నయా లుక్ వైరల్
Raayan Review | ధనుష్ రాయన్గా మెప్పించాడా.. పర్ఫెక్ట్ బెంచ్‌మార్క్ సినిమానా.. ?
Raayan | ధనుష్ రాయన్ స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ప్లాట్‌ఫాం ఇదే..!