Mem Famous | ఈ ఏడాది సుహాస్ టైటిల్ రోల్లో రైటర్ పద్మభూషణ్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాయి ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్. తాజాగా ఈ రెండు బ్యానర్ల నుంచి మరో సినిమా వస్తోంది. రైటర్ పద్మభూషణ్ మేకర్స్ నుంచి వస్తున్న కొత్త సినిమా మేమ్ Famous (Mem Famous). విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ నేపథ్యంలో సాగే ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, సార్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
సుమంత్ ప్రభాస్ స్వీయదర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా నుంచి అయ్యయ్యో లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో ఏమైందీ గుండెలోనా అంటూ పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో సాగుతున్న ఈ పాటను కళ్యాణ్‌నాయక్, హనీ సార్య రాయగా.. రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. పల్లెటూరి వాసులైన సుమంత్ ప్రభాస్, సార్య మధ్య రొమాంటిక్ రిలేషన్షిప్, లవ్ నేపథ్యంలో సాగుతున్న ఈ పాట యూత్‌ను ఆకట్టుకునేలా సాగుతూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
స్నేహం, ప్రేమ, కుటుంబ అంశాల నేపథ్యంలో సాగే కథతో మేమ్ Famous తెరకెక్కుతోంది. ఈ చిత్రం జూన్ 2న గ్రాండ్‌గా విడుదల కానుంది.
Ponniyin Selvan-2 | మణిరత్నం పొన్నియన్ సెల్వన్-2 నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్
Prabhas | రాజా డీలక్స్ క్రేజీ అప్డేట్.. ప్రభాస్-రిద్దికుమార్ స్టిల్ వైరల్