Prabhas | పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) చాలా కాలం తర్వాత మళ్లీ తనలోని లవర్బాయ్ను సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నాడా..? అంటే నెట్టింట చక్కర్లు కొడుతున్న అప్డేట్స్ అవుననే అంటున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) డైరెక్షన్లో హార్రర్ కామెడీ జోనర్ సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ భామ మాళవికా మోహనన్ (Malavika Mohanan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్)తో వస్తున్న ఈ మూవీలో మరో భామ రిద్ది కుమార్ కూడా ప్రభాస్‌తో కలిసి సందడి చేయబోతుంది.
అందుకు తాజాగా నెట్టింట హల్ చల్ చేస్తున్న ఫొటోనే ఉదాహరణ. ప్రభాస్ నుదుటన బొట్టు, లాంగ్ హెయిర్, గడ్డంతో మ్యాన్లీ లుక్‌లో కేరళ ముద్దుగుమ్మ రిద్దికుమార్ (Riddhi Kumar)తో క్లోజప్ యాంగిల్లో ఉన్న స్టిల్‌ను ఫ్యాన్స్ నెట్టింట షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. మిర్చి డేస్ మళ్లీ వచ్చేశాయి.. అంటూ ప్రభాస్ లుక్ చూసిన అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. ఈ చిత్రం కోసం మేకర్స్ అన్నపూర్ణ స్టూడియోలో 19వ శతాబ్దపు కాలం నాటి స్పెషల్ సెట్ వేశారని ఇన్సైడ్ టాక్. మరోవైపు మాళవికా మోహనన్ ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు బయలుదేరిన స్టిల్స్, వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్-K , మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్, ఓం రౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ చిత్రాలు ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. ఈ సినిమాల షెడ్యూల్స్ కు అనుగుణంగా మారుతి సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్.
Prabhas1
ఎయిర్‌పోర్టులో మాళవికా మోహనన్..
.@MalavikaM_ spotted at the airport as she leaves for Hyderabad to join the next schedule of her Telugu film opposite #Prabhas!#MalavikaMohanan @proyuvraaj pic.twitter.com/lZDYXIpXPD
— meenakshisundaram (@meenakshinews) April 14, 2023