గురువారం 28 జనవరి 2021
Cinema - Nov 14, 2020 , 10:16:37

నీకు ప‌డ‌ను అవినాష్ అంటూ మొహం మీదే చెప్పిన అరియ‌నా

నీకు ప‌డ‌ను అవినాష్ అంటూ మొహం మీదే చెప్పిన అరియ‌నా

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 ఎపిసోడ్ 69 అంతా స‌ర‌దా, సంతోషాలు, ఎమోష‌న్స్ మ‌ధ్య సాగాయి. ఒక రోజు ముందే ఇంటి స‌భ్యులు దీపావ‌ళి వేడుక జ‌రుపుకున్నారు. పండుగ సంద‌ర్భంగా హౌజ్‌మేట్స్‌కు వారి కుటుంబ స‌భ్యులు పంపిన గిఫ్ట్స్ అందించారు బిగ్ బాస్. శుక్ర‌వారం ఎపిసోడ్ మొద‌ట్లో రేష‌న్ మేనేజ‌ర్‌గా ఉన్న అవినాష్ గుడ్లు  ప‌గ‌ల‌గొట్టాడు. ఈ విష‌యం అరియానా అంద‌రికి చెప్ప‌డంతో సోహైల్, మెహ‌బూబ్‌లు అవినాష్‌పై త‌మ ప్ర‌తాపం చూపించారు 

అనంత‌రం అరియానా, అవినాష్‌, మెహ‌బూబ్ లు ఓ చోట కూర్చొని కబుర్లు పెట్టారు. అరియానా బాగుంటుంది క‌దా అని అవినాష్ పులిహోర క‌లిపే ప్ర‌యత్నం చేయ‌గా, నేను నీకు ప‌డ‌ను అంటూ అరియానా చెప్పేసింది. ఏం మ‌ట్లాడుతున్నావ్, నీకు అంత సీన్ లేదు నాకు అంత సీన్ లేదు. ఇద్దరం ఫ్రెండ్స్ అంటూ తెగ జీవించేశాడు. అవినాష్ బాధ‌ని చూడ‌లేక నేను నీకు ప‌డిపోతానులే అని అరియానా అన‌డంతో ఏం మాట్లాడుతున్నావ్ అంటూ టాపిక్ డైవ‌ర్ట్ చేశాడు . అయితే మెహ‌బూబ్ కొద్ది సేపు అవినాష్‌ని ఆడుకున్నాడు. 

అరియానా పింక్ శారీ వేసుకుంద‌ని నువ్వు పింక్ షర్ట్ వేసుకున్న‌వా అని మెహ‌బూబ్ అన‌డంతో నేను షర్ట్ మారుస్తా అంటూ తెగ ఫీల‌య్యాడు అవినాష్‌.  


logo