ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 09:42:38

మోనాల్‌తో డేట్‌, హారిక‌తో పెళ్ళి: అవినాష్‌

మోనాల్‌తో డేట్‌, హారిక‌తో పెళ్ళి: అవినాష్‌

85వ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా వ‌చ్చిన సుదీప్ ఇంటి స‌భ్యుల‌తో క‌లిసి సంద‌డి చేశారు. ఒక్కో ఇంటి స‌భ్యుడిని ఒక్కో ప్ర‌శ్న అడ‌గ‌గా వాటికి స‌మాధానాలు ఇచ్చారు. ముందుగా అవినాష్‌ని...ఎవ‌రితో డేట్ చేస్తావు? ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఎవ‌రిని చంపుతావు? అని అడ‌గ‌గా, మోనాల్‌తో డేట్‌, హారిక‌తో పెళ్లి, కానీ అరియానాని చంపుతాన‌ని అన్నాడు. దీంతో సుదీప్ పంచ్‌లు వేయ‌డంతో న‌వ్వులు విరిసాయి. ఇక హారిక‌ను నీకు విధేయ‌తా ముఖ్య‌మా? గెలుపు ముఖ్య‌మా? అన్న ప్ర‌శ్న‌కు విధేయ‌త‌నే ముఖ్య‌మ‌ని తెలివిగా స‌మాధానం ఇచ్చింది.

అభిజీత్‌ని హారిక చిన్న హెయిర్‌తో ఉంటే ఇష్ట‌మా? పొడు‌వు జుట్టుతో ఉంటే ఇష్ట‌మా? అని అడిగారు సుదీప్. దీనికి అభి షార్ట్ హెయిర్ అన్నాడు. చిన్న‌ముఖం మంచిగా క‌నిపిస్తుంద‌ని చెప్పుకొచ్చాడు. ఇక అరియానాను ఒక్క‌రోజు నువ్వు అవినాష్‌లా నిద్ర‌లేస్తే చేసే మొద‌టి ప‌ని ఏంటి? అని అడ‌గ్గా తానస‌లు నిద్ర‌లో నుంచే లేవ‌ను అంటూ ఖరాఖండీగా చెప్పేసింది. సోహైల్‌కు మ‌ట‌న్ లేదా చికెన్‌లో ఏది ఎక్కువ ఇష్ట‌మంటే మ‌ట‌న్ అని జ‌వాబిచ్చాడు. త‌ర్వాత సుదీప్‌ మోనాల్‌ను పిల‌వ‌బోయి అఖిల్‌ను పిలిచారు. అయితే వీళ్లిద్ద‌రిలో ఎవ‌రిని అడిగినా ఒక‌టేలే అని నాగ్ చమ‌త్క‌రించారు.

అఖిల్ ని నువ్వు ఇంట్లో ఎవ‌రిని మాయం చేయాలి అనుకుంటున్నావ్ అని సుదీప్ ప్ర‌శ్నించ‌గా అందుకు మోనాల్ పేరు చెప్పాడు. త‌న వ‌ల‌న కొద్దిగా గేమ్ డిస్ట‌బ్ అవుతుంది అందుకే మాయం చేయాల‌నుకుంటున్నాన‌ని స‌ర‌దాగా చెప్పాడు. ఇక మోనాల్‌కు.. నీగురించి నువ్వు ఏదైనా పుకారు మొద‌లుపెట్టాల‌నుకుంటే అది ఏంటి? అనే ప్ర‌శ్న వేయ‌గా, దానికి స‌మాధానం ఇచ్చిన మోనాల్‌.. ఏడ‌వ‌ను అని చెబుతానంది. తెలుగు బాగా నేర్చుకున్నావ్ మోనాల్ అని సుదీప్ ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ.. నాగ్ స‌ర్‌ని చూసి ఒక డైలాగ్ చెప్ప‌మ‌ని అడిగాడు . దీనికి మోనాల్ నువ్వు నాకు చాలా ఇష్టం అని చెబుతూ తెగ సిగ్గుప‌డిపోయింది. చివ‌రిగా నామినేష‌న్‌లో ఉన్న అఖిల్‌, అవినాష్‌, అరియానాల‌లో అఖిల్‌ని సేవ్ చేసి బిగ్ బాస్ హౌజ్‌ను వీడారు సుదీప్.