సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు అషు రెడ్డి (Ashu Reddy). జూనియర్ సమంతగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ బిగ్ బాస్ షోతో ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది. నెట్టింట ఎప్పటికపుడు హాట్ ఫొటోలతో కుర్రకారును ఫిదా చేసే ఈ భామకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సెప్టెంబర్ 15 (నేడు) అషు రెడ్డి పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఆమె జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి నుంచి ఖరీదైన కారు బహుమతిగా అందుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా..? అషు రెడ్డికి ఆమె తండ్రి ఖరీదైన మెర్సిడేజ్ బెంజ్ C200D మోడల్ (Mersidez c200d) కారును కానుకగా ఇచ్చాడు. తన తండ్రితో కలిసి కారు ముందు దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ‘క్షమించు అమ్మ..షాకవ్వకు..ఇది నాన్న గిఫ్ట్’ అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
ఈ పోస్ట్‌కు ‘కంగ్రాట్స్ బేబీ’ అంటూ యాంకర్స్ శిల్పాచక్రవర్తి, అరియానా గ్లోరీ కామెంట్ పెట్టగా..’అదే చేతులతో కారులో ఒక రౌండ్ ఇస్తవా..నేను డ్రైవ్ చేస్తా..’అంటూ మోడల్, బిగ్ బాస్ కంటెస్టెంట్ జశ్వంత్ కామెంట్ పెట్టాడు. ‘ఈ ఏడాది అందుకున్న సర్ప్రైజ్ గిఫ్ట్..’అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
Read Also : Telugu Film Chamber | తెలుగు ‘ఫిల్మ్ ఛాంబర్-ఫిల్మ్ ఫెడరేషన్’ చర్చలు సఫలం..వివరాలివే..!
Read Also : Indian 2 | ఇండియన్ 2లో కమల్‌హాసన్ కొత్త ప్రయోగం..సెట్స్‌లో అంతా షాక్..!
Read Also :God Father | ‘గాడ్‌ఫాదర్’ ఫస్ట్ సింగిల్ టైం ఫిక్స్.. రిలీజ్ ఎన్నిటికంటే?
Read Also : Vikram Vedha | బాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్.. ‘విక్రమ్ వేధ’ ఎన్ని దేశాల్లో రిలీజవుతుందో తెలుసా..?