The Paradise | నేచురల్ స్టార్ నాని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై మరో కీలక అప్డేట్ వచ్చేసింది. కొంతకాలంగా ఈ సినిమా విడుదల తేదీపై రకరకాల వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా వాటన్నింటికీ చెక్ పెడుతూ మూవీ టీమ్ మరోసారి రిలీజ్ డేట్‌ను ఖరారు చేసింది. ముందుగా ప్రకటించినట్టుగానే 2026 సెప్టెంబర్ 24న ‘ది ప్యారడైజ్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే అమెరికాలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-సేల్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే భారీ స్పందన రావడం విశేషంగా మారింది. దీంతో నాని సినిమాపై ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి స్పష్టమవుతోంది.
‘ది ప్యారడైజ్’కు యూఎస్‌లో ప్రీ-సేల్స్ ప్రారంభం కాగా.. బుకింగ్స్ ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే $50Kకు పైగా టికెట్ సేల్స్ నమోదైనట్లు సమాచారం. రిలీజ్‌కు ఇంకా సమయం ఉండగానే ఈ స్థాయిలో స్పందన రావడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.బుకింగ్స్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే.. రానున్న రోజుల్లో ప్రీ-సేల్స్ మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నాని మార్కెట్‌కు తోడు సినిమాపై ఇప్పటికే ఏర్పడిన భారీ హైప్ యూఎస్ బాక్సాఫీస్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక అమెరికాలో తెలుగు వెర్షన్‌కు సంబంధించి ఎర్లీ అవర్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రిలీజ్ రోజునే యూఎస్‌లో సినిమాకు అదనపు షోలు, మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.
నాని సినిమాలకు అమెరికాలో మంచి మార్కెట్ ఉండటంతో.. ‘ది ప్యారడైజ్’ విషయంలోనూ డిస్ట్రిబ్యూటర్లు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రీ-సేల్స్ ఇదే జోరును కొనసాగిస్తే నాని కెరీర్లోనే ఈ సినిమా మరో భారీ ఓపెనర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రపంచాన్ని, నాని క్యారెక్టర్‌ను, యాక్షన్ ఎలిమెంట్స్‌ను ట్రైలర్లో బలంగా చూపిస్తే హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది.మరోవైపు పెండింగ్‌లో ఉన్న షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసేందుకు చిత్రబృందం వేగంగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఎలాంటి ఆలస్యం లేకుండా అన్ని పనులను పూర్తి చేసి సెప్టెంబర్ 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా టీమ్ ముందుకు సాగుతోంది.