నూఢిల్లీ, సెప్టెంబర్ 8: విమాన చార్జీలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుండటంతో విమానాల్లో ప్రయాణించేవారికి జేబులు మరింత చిల్లులు పడబోతున్నాయి. విమానాల్లో సీట్ల లభ్యత తగ్గుముఖం పట్టడం, ముందస్తు బుకింగ్‌లు అధికంగా ఉండటంతో ఈసారి విమాన చార్జీలు రాకెట్ వేగంతో దూసుకుపోనున్నాయి. ప్రయాణ రద్దీ తీవ్రతరం కావడంతో దేశీయ చార్జీలు విపరీతంగా పెరిగాయి.
ఇది వినియోగదారుల బడ్జెట్‌పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నది. కీలక విమానయాన రూట్లలో విమాన టికెట్ ధరలు 50 శాతం నుంచి 150 శాతం వరకు అధికమయ్యాయి. ప్రధానంగా న్యూఢిల్లీ-ముంబై రూట్లలో డిమాండ్ అధికంగా ఉంటుందని, కానీ, ఢిల్లీ-పాట్నా రూట్లో మాత్రం ఈసారి రెండింతలు అయింది. ప్రధాన రోజుల్లో రూ.3,500 నుంచి రూ.4,500 మధ్యలో విమాన టికెట్ ధరలు ఉండగా..ఈసారి పండుగ సీజన్లో ఇది రూ.12,500 పలికిందని, చివరి నిమిషంలో బుకింగ్ చేసుకున్నవారు రూ.13,500 చెల్లించాల్సి వచ్చింది.
ఏటీఎఫ్ కూడా కారణం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విమాన ఇంధన ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. దీంతో గడిచిన రెండు నెలల్లో ఇంధన ధరలు పది శాతానికి పైగా ఎగబాకాయి. సెప్టెంబర్ 1న రూ.115గావున్న లీటర్ ధర ప్రస్తుతం 5.46 శాతం అధికమై రూ.121.28కి చేరుకున్నది. విమానయాన సంస్థ నిర్వహణలో ఏటీఎఫ్ వాటా సుమారు 35-40 శాతంగా ఉంటుంది.
ఏయే రూట్లలో ఎంత..