Renu Desai | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ అరవింద్ కృష్ణ (Arvind krishna). ఆలస్యం అమృతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, ఆంధ్రాపోరీ, ప్రేమమ్, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలతో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న తాజా చిత్రం 1000 వర్డ్స్ (1000 words). బిగ్ బాస్ ఫేం దివి వైద్యా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్‌కు రేణూదేశాయ్ (Renu Desai), ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డితోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రేణూదేశాయ్ మాట్లాడుతూ.. రమణ ఫొటోగ్రాఫర్‌గా నాకు తెలుసు. ఒక్క ఫొటో మీద కథ రాసుకుని ఈ సినిమా తీశారు. సినిమా చూసిన తర్వాత నాకు కన్నీళ్లు వచ్చాయి. ఆయన నుంచి ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆశిస్తున్నానన్నారు. సినిమాతో అందరినీ కంటతడి పెట్టించారన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. ప్రతీ ఒక్కరి హృదయాన్ని కదిలించే ఈ సినిమాకు అవార్డులు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు అరవింద్ కృష్ణ చెప్పాడు. సూపర్ హీరో ఏ మాస్టర్ పీస్ షూటింగ్లో గాయమవడంతో 8 నెలలు బెడ్‌పైనే ఉన్నా. ఆ టైంలోనే ఈ సినిమా అవకాశం వచ్చిందని.. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని అన్నాడు. ఈ చిత్రంలో మేఘన శ్రీనివాస్, వినయ్ కీ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రమణ విల్లర్ట్ స్వీయదర్శకత్వంలో విల్లర్ట్ ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కించారు. ఈ చిత్రానికి మ్యాస్ట్రో పీవీఆర్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Actress #RenuDesai Speech @ #1000Words Press Meet.#1000WordsFilm #1000Words #VillartRamana #InspirationThroughLens pic.twitter.com/T6wOqWwa0V
— SR Promotions (@SR_Promotions) January 6, 2025
Watch Director #SVKrishnaReddy Speech @ #1000Words Press Meet.🤩#1000WordsFilm #1000Words #VillartRamana #InspirationThroughLens pic.twitter.com/vCZFLAqHbF
— SR Promotions (@SR_Promotions) January 6, 2025
Ajith kumar | రేసింగ్‌లో ట్రాక్‌ను ఢీకొట్టిన అజిత్‌కుమార్ కారు.. తప్పిన భారీ ప్రమాదం