Ajith kumar | కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్‌కుమార్ (Ajith kumar)కు బైక్ రైడ్, కార్ రేసింగ్ అనే చాలా ఇష్టమని తెలిసిందే. టైం దొరికినప్పుడలా రైడ్స్, రేసింగ్‌లో పాల్గొంటాడు. అయితే కార్ రేసింగ్‌లో అజిత్‌కుమార్‌కు భారీ ప్రమాదం తప్పింది. దుబాయ్‌లో రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్ కారు ట్రాక్‌ను ఢీకొట్టింది. అయితే అప్రమత్తమైన అజిత్‌కుమార్ వెంటనే కారును కంట్రోల్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.. స్వల్ప గాయాలతో కారులో నుంచి బయటపడ్డాడు అజిత్ కుమార్.
వెంటనే సెక్యూరిటీ టీం అజిత్‌ను కారులోని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అభిమానులంతా ఊపిరిపీల్చుకున్నారు. మీ భద్రత, ఆరోగ్యం మాకు ముఖ్యమని.. ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.
రేసింగ్‌లో ట్రాక్‌ను ఢీకొట్టిన కారు..
{ 💔💔💔💔💔💔💔💔💔💔💔 }
From The Bottom Of Our Hearts, We, Your Fans, Wish You a Safe Racing journey, Chief.
Your Safety and Health Mean More Than Anything to Us. May God be with you always 🙏🏻#AjithKumar pic.twitter.com/vtkR4wCETI
— AJITHKUMAR FANS CLUB (@ThalaAjith_FC) January 7, 2025