Adipurush | దేశ ప్రజలకు ఆదిపురుష్ టీం క్షమాపణలు చెప్పాలి : శివసేన ఎంపీ
Adipurush | ఆదిపురుష్ (Adipurush) చిత్రంపై శివసేన (యూబీటీ) (Shiv Sena - Uddhav Balasaheb Thackeray) ఎంపీ ప్రియాంక చతుర్వేది (MP Priyanka Chaturvedi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Adipurush | ఆదిపురుష్ (Adipurush) చిత్రంపై శివసేన (యూబీటీ) (Shiv Sena – Uddhav Balasaheb Thackeray) ఎంపీ ప్రియాంక చతుర్వేది (MP Priyanka Chaturvedi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ ( Om Raut) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఈ చిత్రంలో అమర్యాదకరమైన సంభాషణలు ఉపయోగించారని ఎంపీ ఆరోపించారు. ఇందుకు గానూ దేశ ప్రజలకు చిత్రబృందం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
‘ఆదిపురుష్ చిత్రంలో అమర్యాదకరమైన సంభాషణలు ఉపయోగించారు. ముఖ్యంగా హనుమంతుడి డైలాగ్స్ విషయంలో డైలాగ్ రైటర్ ముంతాషిర్ శుక్లా, చిత్ర దర్శకుడు ఓంరౌత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. వినోదం పేరుతో మనం పూజించే దేవుళ్లకు భాషను ఆపాదించడం ప్రతి భారతీయుడి మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. మర్యాద పురుషోత్తముడైన రాముడిపై సినిమా తీసి.. బాక్సాఫీస్ వద్ద విజయం కోసం మర్యాదకు సంబంధించిన అన్ని హద్దులు దాటడం ఆమోదయోగ్యం కాదు’ అని ఆమె పేర్కొన్నారు.
మైథలాజికల్ సినిమాగా రూపొందిన ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతీసనన్ సీతగా కనిపించింది. లంకాధిపతి రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించాడు. ఓంరౌత్ దర్శకుడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేసింది.
The dialogue writer of Adipurush @manojmuntashir as well as the director should apologise to the nation for the pedestrian dialogues written for the movie, especially for Lord Hanuman. It hurts every Indian’s sensibilities to see the kind of language being attributed to our…
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) June 17, 2023
Also Read..
Manipur Violence | మణిపూర్ ను ఎవరూ రాష్ట్రంగా గుర్తించట్లేదు.. ఆర్మీ విశ్రాంత అధికారుల ఆవేదన
Donald Trump | రెస్టారెంట్ లో బిల్లు కట్టకుండా జారుకున్న ట్రంప్.. నెట్టింట ట్రోల్స్
Cat | ఆ విమానాశ్రయంలో పిల్లికి ఉద్యోగం.. దాని పనేంటో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

