Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. తన నోటి దురుసు, ప్రవర్తనతో నిత్యం విమర్శల పాలవుతుంటారు. తాజాగా ట్రంప్ విషయంలో మరోసారి అలానే జరిగింది. ఇటీవల ఓ హోటల్ ను సందర్శించిన ట్రంప్.. బిల్లు కట్టకుండానే వెళ్లిపోయారట.
అధికారిక రహస్యాల దస్త్రాలను తన ఇంట్లో దాచారన్న కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ట్రంప్.. మంగళవారం (జూన్ 13) మియామీ (Miami) లోని ఫెడరల్ కోర్టుకు హాజరయ్యారు. తిరుగుప్రయాణంలో స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్ ను సందర్శించారు. అక్కడున్న వారు ట్రంప్ ను చూసి మాజీ అధ్యక్షుడిని చుట్టుముట్టారు. జూన్ 14న ట్రంప్ పుట్టినరోజు ఉండటంతో ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడున్న వారందరికీ ట్రంప్ ఫ్రీగా ఫుడ్ ఆఫర్ చేశారు. అనంతరం బిల్లు చెల్లించకుండానే అక్కడి నుంచి జారుకున్నట్లు కొందరు తెలిపారు. దీంతో, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు ట్రంప్ ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
ఈ వార్తలను ట్రంప్ ప్రతినిధి ఖండించారు. ట్రంప్ వెళ్లిపోయిన తర్వాత రెస్టారెంట్ లోని వారంతా కూడా ఫుడ్ ఆర్డర్ చేయకుండానే వెళ్లిపోయారని తెలిపారు. అద్భుత ఆతిథ్యమిచ్చిన రెస్టారెంట్ నిర్వాహకులకు ట్రంప్ ధన్యవాదాలు చెప్పారని అన్నారు. మరోమారు కచ్చితంగా ఆ రెస్టారెంట్‌ను ట్రంప్ సందర్శిస్తారని వివరించారు.
Also Read..
Cat | ఆ విమానాశ్రయంలో పిల్లికి ఉద్యోగం.. దాని పనేంటో తెలుసా..?
Manipur Violence | మణిపూర్‌లో చల్లారని హింస.. బీజేపీ నేతల ఇళ్లను తగలబెడుతున్న అల్లరి మూకలు
Sword | తవ్వకాల్లో బయటపడ్డ 3 వేల ఏళ్ల నాటి ఖడ్గం..!