Sword | జర్మనీ (Germany) లో పురావస్తు శాస్త్రవేత్తలు (Archaeologists) జరిపిన తవ్వకాల్లో కాంస్య యుగానికి చెందిన ఓ ఖడ్గం బయటపడింది. దాదాపుగా 3 వేల సంవత్సరాలైనా ఆ ఖడ్గం ఇప్పటికీ ఏమాత్రం పాడవకుండా మెరుస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బవేరియన్ స్టేట్ ఆఫీస్ ఫర్ మోనుమెంట్ ప్రొటెక్షన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బవేరియన్ (Bavarian) పట్టణంలోని నార్డ్లింజెన్ (Nordlingen) లో జరిపిన తవ్వకాల్లో ఓ మహిళ, పురుషుడు, చిన్నారి సమాధిలో ఈ ఖడ్గం కనిపించింది. ముగ్గురిని ఒకరి తర్వాత మరొకరిని ఖననం చేశారని, వారి మధ్య సంబంధం ఏంటనేది తెలియరాలేదని పేర్కొంది.
కాగా ఈ ఖడ్గం కాంస్య యుగానికి చెందిన అష్టభుజ కత్తి రకం అని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని అష్టభుజి పిడిని పూర్తిగా కాంస్యంతో తయారుచేసినట్లు చెప్పారు. ఇది 14వ శతాబ్దానికి చెందినదని, ఆ కాలం నాటివి ఈ ప్రాంతంలో దొరకడం చాలా అరుదైన విషయమని వారు వెల్లడించారు. ఎందుకంటే మధ్య కాంస్య యుగం నాటి సమాధులు శతాబ్దాలుగా లూటీకి గురయ్యాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Also Read..
Road Accident | శనిదోశ నివారణ కోసం గుడికి వెళ్తుండగా వ్యానును ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి
France | ఫ్రాన్స్‌లో భారీ భూకంపం.. 5.8 తీవ్రత.. పెద్దసంఖ్యలో నేలమట్టమైన ఇండ్లు