Manipur Violence | మణిపూర్‌లో చల్లారని హింస.. బీజేపీ నేతల ఇళ్లను తగలబెడుతున్న అల్లరి మూకలు
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకీ మరింత క్షీణిస్తున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది.
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ హింసకు ఇప్పడప్పుడే తెరపడేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకీ మరింత క్షీణిస్తున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. క్వక్తా ( Kwakta), కాంగ్వై (Kangvai) ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తాజా ఘర్షణలతో శనివారం తెల్లవారుజామున వరకు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు భారీ సంఖ్యలో గుంపుగా తరలివచ్చి విధ్వంసానికి యత్నించడం వంటి పలు ఘటనలు చోటు చేసుకున్నాయని ఆర్మీ, పోలీసు అధికారులు తెలిపారు.
స్థానికంగా ఉన్న అడ్వాన్స్ హాస్పిటల్ సమీపంలోని ప్యాలెస్ కాంపౌండ్ వద్ద ఓ అల్లరి మూక నిప్పంటిచడానికి ప్రయత్నించిందని.. ఆ మూకలో దాదాపుగా వెయ్యిమంది వరకు ఉన్నారని అధికారులు తెలిపారు. బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు గాయపడినట్లు చెప్పారు. మణిపూర్ యూనివర్సిటీ సమీపంలో కూడా కొందరు గుంపుగా ఏర్పడి విధ్వంసానికి యత్నించినట్లు తెలిపారు.
మరోవైపు సుమారు 300 నుంచి 400 మంది గుంపుగా వచ్చి ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఇరింగ్బామ్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆయుధాలను లూటీ చేసేందుకు విఫలయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. ఆర్మీ, అస్సాం రైఫిల్స్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, రాష్ట్ర పోలీసు యంత్రాంగం సంయుక్తంగా ఈ దాడుల్ని భగ్నం చేసినట్లు వెల్లడించారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలో అర్ధరాత్రి వరకు ఫ్లాగ్ మార్చ్ చేపట్టినట్లు తెలిపారు.
మరోవైపు ఆందోళన కారులు స్థానికంగా ఉన్న బీజేపీ నేతల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు సహా, స్థానిక ఎమ్మెల్యేలు, పలువురు బీజేపీ నేతల ఇళ్లపై పెట్రో బాంబులతో దాడి చేసి ధ్వంసం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం (బుధవారం రాత్రి) ఆ రాష్ట్రంలోని ఏకైక మహిళా మంత్రి ఇంటికి ఆందోళన కారులు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి కూడా ఆందోళన కారులు చెలరేగిపోయారు. ఇంఫాల్‌లోని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఆర్కే రాజన్ సింగ్ ఇంటిపైకి గురువారం రాత్రి అల్లరి మూక బాంబు దాడికి పాల్పడింది. భద్రతా సిబ్బంది, అగ్నిమాపక శాఖ సకాలంలో మంటలను ఆపడంతో పెద్ద నష్టం తప్పింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇంఫాల్ వెస్ట్ లోని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శారదా దేవి నివాసం వద్ద ఆందోళన కారులు విధ్వంసానికి యత్నించారు. సైన్యం, పోలీసు యంత్రాంగం వారిని అడ్డుకుంది.
మణిపూర్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత నెలలో మైతీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా ప్రకటించింది. అయితే నాగా, కుకీ సామాజిక వర్గాలకు చెందిన వారు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మే 3న మైతీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. నాటి నుంచి గత నెలకుపైగా కొనసాగుతున్న అల్లర్లు, హింసాత్మక సంఘటనల్లో సుమారు 120 మందికిపైగా పౌరులు మరణించారు. 350 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయలయ్యారు.
Also Read..
Sword | తవ్వకాల్లో బయటపడ్డ 3 వేల ఏళ్ల నాటి ఖడ్గం..!
Oliver Whitehouse: ఆరు బంతుల్లో ఆరు వికెట్లు.. ఇంగ్లండ్ టీనేజర్ కొత్త రికార్డు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
Road accident | గద్వాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
SCENE Trailer | ‘సీన్’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచుతున్న సూర్య-నస్లెన్ మైండ్ గేమ్!
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

