అందం ఉన్నా అదృష్టం లేని అతి తక్కువ మంది హీరోయిన్లలో అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) కూడా ఉంటుంది. పాపం బోలెడంత అందం ఉన్నా కూడా విజయాలు మాత్రం ఈమె దరి చేరడం లేదు. అందుకే హాట్ షో తప్ప మరో మార్గం లేదన్నట్లు రెచ్చిపోతుంది. ఇప్పుడు బయటికి వచ్చిన ఈ ఫోటోలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. మజ్నుతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ మళయాలి సొగసరి ఇప్పుడు ఉనికి చాటుకునే క్రమంలో ఉంది. ఇప్పటికే తన సోగకళ్లతో కుర్రాళ్లను మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు (Tollywood) లో స్టార్ హీరోలతో కూడా నటించింది.
పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి..అల్లు అర్జున్ నా పేరు సూర్య లాంటి సినిమాలు కూడా చేసింది. కానీ లక్ కలిసి రాక అలాగే మిగిలిపోయింది. నాగ చైతన్య, గోపీచంద్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోలు కూడా ఈమె జాతకాన్ని మార్చలేకపోయారు. అందుకే మజ్ను లాంటి సినిమాలలో పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ..ఇప్పుడు అందాల బాణాలు వదిలేస్తుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే..మరోవైపు ఫోటోషూట్లలో రెచ్చిపోతుంది ఈ కేరళకుట్టి. తాజాగా అమ్మాయి ఓ ఫోటోషూట్ లో చూపులతోనే చంపేస్తోంది. ట్రెడిషినల్ లుక్ తో పాటు తనలో ఈ మోడ్రన్ యాంగిల్ కూడా ఉందని దర్శకులకు హింటిస్తుంది అను ఎమ్మాన్యువల్.
ఇప్పుడు చేతిలో పెద్దగా సినిమాలేం లేవు. వచ్చిన అరకొర అవకాశాలతోనే ముందుకెళ్లాలని చూస్తుంది. ప్రస్తుతం అల్లు శిరీష్ ప్రేమ కాదంట సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత మరిన్ని ఆఫర్స్ వస్తాయని ఆశగా చూస్తుంది అను. అందుకే ఈ అందాల ఆరబోత కూడా. మరి ఈమె ఆశలు ఎంతవరకు తీరుతాయో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
శృతి హాసMahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?