Kalpika Ganesh | నటి కల్పిక గణేశ్ (Kalpika Ganesh)పై మరో కేసు నమోదైంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అసభ్య పదజాలంతో కల్పిక తనని దూషించిందని, వేధింపులకు పాల్పడిందని ఆరోపిస్తూ కీర్తన అనే యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి ఆధారాలను కూడా పోలీసులకు అందించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కల్పికపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు.
కాగా, నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రిజం పబ్ (Prism Pub) వ్యవహారంలో ఇప్పటికే కల్పికపై ఓ కేసు నమోదైన విషయం తెలిసిందే. కల్పిక గత నెల 29న ప్రిజం పబ్‌కు వెళ్లింది. అక్కడ కేక్ విషయంలో కల్పిక గణేశ్‌కు, పబ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో నటి కల్పిక తమ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల సమక్షంలోనే హంగామా సృష్టించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కల్పికపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు పబ్‌లో గొడవకు సంబంధించి కల్పిక ఇటీవలో ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ కేక్ విషయంలో తనతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా డ్రగ్ ఎడిక్ట్ అంటూ దూషించారని అందులో పేర్కొంది. ఈ క్రమంలో సిబ్బందితో వాగ్వాదం జరిగిందని, అది ముదరడంతో పబ్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారని తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించింది.
Also Read..
Amazon Prime Video | ప్రైమ్ వీడియో వినియోగదారులకు షాక్.. గంటకు 6 నిమిషాల యాడ్స్
Kuberaa Trailer | మళ్లీ వాయిదా పడిన ‘కుబేర’ ట్రైలర్.. కారణం ఇదే!
Anirudh Ravichander | SRH జట్టు ఓనర్ కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి.. స్పందించిన టీమ్