Kubera Trailer | టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం కుబేరా. ధనుష్, నాగార్జున, రష్మిక మందాన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమా ట్రైలర్ను మొదటగా జూన్ 13న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరగడంతో ట్రైలర్ విడుదల వాయిదా వేసి జూన్ 14న విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే తాజాగా జూన్ 14న కూడా ట్రైలర్ విడుదలను వాయిదా వేసినట్లు తెలిపింది. ఈ సినిమా ట్రైలర్ను జూన్ 15న జరుగబోతున్న కుబేర గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించింది.
Our crew has been pouring heart and soul into every frame of #Kuberaa. After multiple internal discussions, we’ve collectively felt that the true essence of the trailer can only be felt in the right atmosphere, with our cast, crew, and audience together ♥️
So instead of a…
— Kuberaa Movie (@KuberaaTheMovie) June 14, 2025