Prime Video Ads | ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలోని తమ వినియోగదారులకు షాక్ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రకటనలు లేకుండా చూసిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇకపై యాడ్స్‌తో ప్రసారం కాబోతున్నాయి. జూన్ 17 నుంచి ఈ విధానం అమల్లోకి రాబోతున్నట్లు అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా దీనిపై మరిన్ని సవరణలు చేసినట్లు తెలుస్తుంది. కొత్త రూల్స్ ప్రకారం.. ప్రతి గంటకి ఆరు నిమిషాల యాడ్స్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రకటనలతో కూడిన కంటెంట్‌ను చూడటానికి అభ్యంతరం లేనివారు ప్రస్తుత ప్లాన్‌తోనే కొనసాగవచ్చని తెలిపింది. అయితే ప్రకటనలు లేకుండా చూడాలనుకునేవారు నెలవారీగా రూ. 129 లేదా ఏడాదికి రూ. 699 అదనపు రుసుముతో కొత్త ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో కంటెంట్‌పై మరింత పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
భారతదేశంలోని ఓటీటీ మార్కెట్లో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. నెట్‌ఫ్లిక్స్ వంటి కొన్ని ప్రధాన వేదికలు ఇప్పటికీ ప్రకటనలు లేని సేవలను అందిస్తున్నాయి. అమెజాన్ యొక్క ఈ చర్య వినియోగదారులను ఇతర వేదికల వైపు ఆకర్షించే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ, జూన్ 17 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రకటనల ప్రారంభం కానున్నాయి.
Read More