WTC Final : లార్డ్స్ మైదానంలో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం దిశగా సాగుతున్న దక్షిణాఫ్రికా(South Africa)కు షాక్. నాలుగో రోజు తొలి సెషన్ ప్రారంభమైన 10 నిమిషాల్లోనే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వికెట్ సాధించాడు. నిన్నటి నుంచి క్రీజులో పాతుకుపోయిన తెంబ బవుమా(66)ను ఔట్ చేసి కంగరూలకు ఊరటనిచ్చాడు.
బవుమా డిఫెన్స్ చేద్దామనుకున్న బంతి బంతి ఎడ్జ్ తీసుకోగా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ఒడుపుగా అందుకున్నాడు. దాంతో, మూడో వికెట్147 పరుగుల భాగస్వామానికి తెరపడింది. ప్రస్తుతం సెంచరీ హీరో మర్క్రమ్(106 నాటౌట్)కు జతగా ట్రిస్టన్ స్టబ్స్ క్రీజులో ఉన్నాడు. ఇంకా దక్షిణాఫ్రికా చరిత్రాత్మక విజయానికి 64 పరుగులు అవసరం.
Captain gets captain – Pat Cummins with the breakthrough Australia desperately needed!
Bavuma’s battle ends with South Africa 65 away from victory#SAvAUS #WTCFinal pic.twitter.com/cKuDUQU7B4
— ESPNcricinfo (@ESPNcricinfo) June 14, 2025
తొలి రోజు నుంచి ఆధిపత్యం చేతులు మారుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా విజయానికి చేరువలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 207కే ఆలౌట్ చేసిన సఫారీ జట్టు.. 282 పరుగుల ఛేదనలో అదరగొడుతోంది. ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(106 నాటౌట్) చిరస్మరణీయ సెంచరీ బాదగా.. గాయంతో బాధపడుతూనే తెంబ బవుమా(66) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మూడో రోజు టీ సెషన్ తర్వాత ఆసీస్ బౌలర్లను విసిగిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారిద్దరూ.
A MARKRAM MASTERCLASS! ✨ pic.twitter.com/cBECvztAo8
— ESPNcricinfo (@ESPNcricinfo) June 13, 2025
చకచకా సింగిల్స్, డబుల్స్ తీస్తూ లక్ష్యాన్ని కరిగించిందీ జోడీ. మరికాసేపట్లో మూడో రోజు ఆట ముగుస్తుందనగా హేజిల్‌వుడ్ ఓవర్లో బౌండరీతో మర్క్రమ్ శతకం సాధించాడు. దాంతో, 214 పరుగులతో రోజును ముగించింది సఫారీ జట్టు. నాలుగో రోజు విజయానికి 69 పరుగులు అవసరం కాగా.. తొలి సెషన్లో మ్యాచ్ ముగించాలనుకున్నారు మర్క్రమ్, బవుమా. కానీ.. రెండో రోజు 6 వికెట్లతో నిప్పులు చెరిగిన కమిన్స్.. తన రెండో ఓవర్లోనే బవుమాను ఔట్ చేసి దక్షిణాఫ్రికాకు షాకిచ్చాడు.