Anirudh Ravichander – Kavya Maaran | ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు యజమాని కావ్య మారన్ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అనిరుధ్ కావ్యతో ఒక సంవత్సరం పాటు డేటింగ్ చేశారని, త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అనిరుధ్ వ్యక్తిగత బృందం తాజాగా క్లారిటీనిచ్చింది.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని అనిరుధ్ బృందం స్పష్టం చేసింది. కావ్య మారన్ తాను మంచి స్నేహితులు మాత్రమేనని అనిరుధ్ వ్యక్తిగత బృందం తెలిపింది. అనిరుధ్‌పై ఇలాంటి వార్తలు రావడం కొత్తేమికాదు. ఇంతకుముందు కూడా నటి కీర్తి సురేష్, గాయని జోనితా గాంధీ, నటి త్రిషలతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు కూడా రుమార్స్ అని తర్వాత తెలిసింది.
ఇక సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్, ఐపీఎల్ మ్యాచ్‌లలో SRH జట్టును ఉత్సాహపరుస్తూ తరచుగా కనిపిస్తుంటారు. ఆమె ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. అనిరుధ్‌తో పెళ్లి అని వస్తున్న వార్తలపై కావ్య మారన్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి ఇవి కేవలం పుకార్లుగానే మిగిలాయి.
Read More