మంచాల, జూన్ 14: అసంపూర్తిగా ఉన్న ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మత్స్య కార్మిక ముదిరాజ్ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని శనివారం ఆయన నివాసంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. అసంపూర్తిగా పనులు నిలిచిపోయిన మత్స్య ముదిరాజ్ సంఘం భవన పనులను వెంటనే చేపట్టేందుకు ఎమ్మెల్యే నిధుల నుంచి రూ .10 లక్షలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మత్స్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.