శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 19:30:21

యాంక‌ర్ ర‌వి పెళ్లి గిఫ్ట్ అదిరిపోయింది..వీడియో వైర‌ల్

యాంక‌ర్ ర‌వి పెళ్లి గిఫ్ట్ అదిరిపోయింది..వీడియో వైర‌ల్

బుల్లితెర యాంకర్సే కదా అని తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్లు కూడా హీరోలు సంపాదించినంత సంపాదిస్తున్నారు. నెలలో 30 రోజులు ఉంటే.. ఆ 30 రోజులు బిజీగానే ఉంటారు వాళ్లు. పైగా ఒకటి రెండు కాదు ఒకేసారి మూడు నాలుగు షోలు చేస్తుంటారు..పై నుంచి వచ్చే ఈవెంట్స్ మళ్లీ బోనస్. అలా తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు మార్కెట్ సృష్టించుకున్న యాంకర్ రవి. ఎప్పుడూ బిజీగా ఉండే ఈ యాంకర్ ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ కోసం కాస్త స్పేస్ తీసుకున్నాడు. తన భార్యతో కలిసి హాయిగా ఎంజాయ్ చేసాడు. నవంబర్ 27న ఈయన తమ పెళ్లి రోజు సందర్భంగా భార్య నిత్య సక్సేనాకు మరిచిపోలేని బహుమతి ఇచ్చాడు. 8 ఏళ్ళ తమ బంధానికి గుర్తుగా అందమైన పాటను గిఫ్టుగా ఇచ్చాడు యాంకర్ రవి. 

ఈయనకు పెళ్లైన సంగతి చాలా మందికి రెండేళ్ల కింది వరకు తెలియదు. స్వయంగా ఓ రోజు సడన్‌గా తన భార్య నిత్య సక్సేనాతో పాటు కూతురు ప్రపంచానికి పరిచయం చేసాడు యాంకర్ రవి. అది చూసి అంతా షాక్ అయ్యారు. రవికి పెళ్లైపోవడమే కాదు ఇంత పెద్ద కూతురు కూడా ఉందా అంటూ నోరెళ్లబెట్టారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు తన భార్య, కుటుంబం ఫోటోలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నాడు రవి. ఎలాంటి దాపరికాలు లేకుండా ఫ్యామిలీ ఫోటోలు బయటపెడుతున్నాడు. ఇప్పుడు తమ పెళ్లి రోజును కూడా గ్రాండ్ గా జరుపుకున్నాడు రవి. ఎప్పటికీ గుర్తుండిపోయే.. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునేలా ఈ గిఫ్ట్ ఇచ్చాడు రవి. 


రాహు సినిమాలో సిధ్ శ్రీరామ్ పాడిన సూపర్ హిట్ సాంగ్ ఏమో ఏమో కవర్ సాంగ్ చేసారు రవి జోడీ. స్క్రీన్ పై తన రియల్ లైఫ్ వైఫ్ తో కలిసి అదిరిపోయే రొమాన్స్ చేసాడు ఈ యాంకర్. అందమైన లొకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. దానికితోడు మైమరిపించే సినిమాటోగ్రఫీ ఈ పాటకు ప్లస్. సినిమా పాటను తలదన్నేలా ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన యూ ట్యూబ్ ఛానెల్ లోనే విడుదల చేసాడు యాంకర్ రవి.