బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే.. రంగీలా పాటల్లో రాగం నువ్వేలే.. ఓ మిస్సమ్మా మిస్సమ్మా యమ్మ (o missamma missamma yamma song) నా వీనస్సే నువ్వేనమ్మా.. ఈ ఆల్ టైమ్ సూపర్ హిట్ ఫేవరేట్ సాంగ్ గుర్తుండని వారుండరు. బద్రి సినిమాలో రేణూదేశాయ్, పవన్ కల్యాణ్ మధ్య వచ్చే ఈ డ్యుయెట్ సాంగ్‌కు ఫిదా కాని మ్యూజిక్ లవర్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇపుడిదే పాటను మరోసారి గుర్తుకు తెస్తోంది బాలీవుడ్ భామ అమీషా పటేల్ (Ameesha Patel) .
టూ పీస్ బికినీ వేర్లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని.. సాగరతీరాన ఉన్న ఫుట్‌పాత్‌పై నుంచి నడుచుకుంటూ వస్తూ.. కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తోంది అమీషా పటేల్. ఐదు పదుల వయస్సు దగ్గరికొచ్చిన వన్నెతరగని అందంతో ర్యాంప్ వాక్ స్టైల్లో నడుస్తూ.. నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది అమీషా పటేల్.
అమీషా పటేల్ సాగరతీరంలోని అందాలను ఆస్వాదిస్తూ.. పొట్టిడ్రెస్లో సందడి చేస్తున్న స్టిల్స్, వీడియో ఇపుడు ఆన్లైన్లో హల్ చల్ చేస్తున్నాయి. అమీషా పటేల్ ప్రస్తుతం మిస్టరీ ఆఫ్ టాటూ చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తోంది. సన్నీడియోల్తో కలిసి Gadar 2: The Katha Continuesలో నటిస్తోంది. ఈ బ్యూటీ బద్రిలో మరో ఫేమేల్ లీడ్ రోల్లో నటించిన విషయం తెలిసిందే.
అమీషా పటేల్ వాక్.. వీడియో
❤️🔥❤️🔥❤️🔥💋💋💋❤️🔥❤️🔥 pic.twitter.com/hdLszmJBsz
— ameesha patel (@ameesha_patel) December 15, 2022
Read Also : Dil Raju | వారసుడు ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదట.. ఇంతకీ ఎవరో చెప్పిన దిల్ రాజు
Read Also : Indian 2 | ఇండియన్ 2 అప్డేట్.. కమల్‌హాసన్ డెడికేషన్‌కు ఫిదా అవ్వాల్సిందే.. !
Read Also : Venkatesh | వెంకటేశ్‌ను ఇంప్రెస్ చేయలేకపోతున్న డైరెక్టర్లు.. స్టోరీ రైటర్ కావాలట..!