Avatar : The Way Of Water | తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 రెస్పాన్స్ ఎలా ఉందంటే.. ?
మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ ప్రాజెక్ట్ అవతార్ 2 (Avatar: The Way Of Water) రానే వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో రిలీజ్‌కు ముందు నుంచే ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచింది. తాజా ట్రేడ్ సర్కిల్ టాక్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల షోల నుంచే భారీ ఆక్యుపెన్సీతో అవతార్ 2 షోలు ప్రారంభం అయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ ప్రాజెక్ట్ అవతార్ 2 (Avatar: The Way Of Water) రానే వచ్చింది. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరాన్ (James Cameron) దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని భాషలతోపాటు తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో రిలీజ్‌కు ముందు నుంచే ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచింది.
తాజా ట్రేడ్ సర్కిల్ టాక్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల షోల నుంచే భారీ ఆక్యుపెన్సీతో అవతార్ 2 షోలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఇదే ట్రెండ్ కొనసాగిస్తూ.. తొలి రోజే భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి పెద్ద తెలుగు సినిమాలేమి లేకపోవడంతో.. పాజిటివ్ టాక్ ఇలాగే కొనసాగితే బాక్సాఫీస్ వద్ద అవతార్ 2 మంచి హిట్టు కొట్టడం ఖాయమని అంటున్నారు సినీ జనాలు.
ఇప్పటికే విడుదలైన అవతార్ 2 ట్రైలర్స్, 3డీ వెర్షన్ ట్రైలర్ (Avatar-2 Trailer) నెట్టింట ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. మరి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించిన అవతార్ రికార్డులను అవతార్ 2 బద్దలు కొడుతుందా..? లేదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అవతార్ 2 ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో సుమారు 55 వేల థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
అవతార్ 2 ఫైనల్ ట్రైలర్..
On December 16, experience the motion picture event of a generation.
Watch the brand-new trailer and experience #AvatarTheWayOfWater in 3D. Get tickets now: https://t.co/ILR3jmx72s pic.twitter.com/3hrAYeQlSx
— 20th Century Studios (@20thcentury) November 22, 2022
అవతార్ 2 ట్రైలర్ ..వీడియో
On December 16, return to Pandora.
Watch the brand-new trailer and experience #AvatarTheWayOfWater in 3D. pic.twitter.com/U2iztiq2Nh
— 20th Century Studios (@20thcentury) November 2, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

