Venkatesh | వెంకటేశ్‌ను ఇంప్రెస్ చేయలేకపోతున్న డైరెక్టర్లు.. స్టోరీ రైటర్ కావాలట..!
ఈ ఏడాది ఎఫ్ 3 సినిమాలో మంచి వినోదాన్ని అందించిన వెంకటేశ్ ఆ తర్వాత ఓరి దేవుడా చిత్రంలో అతిథి పాత్రలో మెరిశాడు. ప్రస్తుతం వెంకట్ బోయినపల్లి, నాగవంశీ, జ్ఞానవేళ్ రాజా లాంటి నిర్మాతలతోపాటు చాలా మంది డైరెక్టర్లు వెంకటేశ్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు..
టాలీవుడ్లో సక్సెస్‌రేట్ ఎక్కువగా ఉన్న హీరోల్లో టాప్‌లో ఉంటాడు విక్టరీ వెంకటేశ్ (Venkatesh). కెరీర్లో వెంకీ సినిమాలు గమనిస్తే.. అన్ని మినిమం గ్యారంటీ, సూపర్ హిట్ చిత్రాలే ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది ఎఫ్ 3 సినిమాలో మంచి వినోదాన్ని అందించిన వెంకటేశ్ ఆ తర్వాత ఓరి దేవుడా చిత్రంలో అతిథి పాత్రలో మెరిశాడు.
ప్రస్తుతం వెంకట్ బోయినపల్లి, నాగవంశీ, జ్ఞానవేళ్ రాజా లాంటి నిర్మాతలతోపాటు చాలా మంది డైరెక్టర్లు వెంకటేశ్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు.. అతడి డేట్స్ కోసం వెంట పడుతున్నట్టు టాలీవుడ్ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. హిట్2 డైరెక్టర్ శైలేష్ కొలను, శ్యామ్ సింగ రాయ్ ఫేం రాహుల్ సంకీర్త్యన్ , బంగార్రాజు ఫేం కల్యాణ్ కృష్ణ ప్రస్తుతం వెంకీ డేట్స్ కోసం చూస్తున్నట్టు టాక్. అయితే వెంకీ గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇవ్వడం లేదని డౌటు రావొచ్చు. కారణమేంటంటే ఎవరూ సరైన కథతో వెంకీని ఇంప్రెస్ చేయకపోవడమే.
సంపత్ నంది ఇప్పటివరకు వెంకీకి కథ వినిపించిన వారిలో ఉన్నాడు. కాగా మిగిలిన దర్శకులు సరైన కథ కోసం ఎదురుచూస్తున్నట్టు టాక్ నడుస్తోంది. నిర్మాత సురేశ్‌బాబు కథ ఫైనల్ చేస్తే కానీ వెంకటేశ్ సినిమా ట్రాక్‌పైకి వచ్చే అవకాశాలు లేవట. తాజా టాక్ ప్రకారం రెగ్యులర్ లైన్‌ను దాటేసే కొత్త స్టోరీ అయితే బాగుంటుందని.. అందుకే మంచి స్టోరీ రైటర్ కావాలని (Story Writer) ఈ స్టార్ హీరో అనుకుంటున్నట్టు ఇన్సైడ్ టాక్.
ప్రస్తుతం వెంకటేశ్ విదేశాల్లో ఉన్నట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. కాగా ఇండియాకు తిరిగొచ్చాక వెంకీ చాలా కథలు వింటాడని, వాటిలో ఏదో ఒకటి ఒకే చేశాకే నెక్ట్స్ సినిమాపై క్లారిటీ రానుందని చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
Read Also : Avatar : The Way Of Water | తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 రెస్పాన్స్ ఎలా ఉందంటే.. ?
Read Also : Dil Raju | వారసుడు ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదట.. ఇంతకీ ఎవరో చెప్పిన దిల్ రాజు
Read Also : Indian 2 | ఇండియన్ 2 అప్డేట్.. కమల్‌హాసన్ డెడికేషన్‌కు ఫిదా అవ్వాల్సిందే.. !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

