Indian 2 | ఇండియన్ 2 అప్డేట్.. కమల్‌హాసన్ డెడికేషన్‌కు ఫిదా అవ్వాల్సిందే.. !
కమల్ హాసన్ అంటేనే ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్. సినిమాపై కమల్ హాసన్ ఎంత డెడికేషన్ చూపిస్తాడో ఆయన నటించిన వైవిధ్యమైన పాత్రలు చూస్తే అర్థమవుతుంది. కమల్ హాసన్ ఇండియన్ 2లో స్వాతంత్ర సమరయోధుడి పాత్రలో నటిస్తున్నాడు.
శంకర్ (Shankar), కమల్ హాసన్ (kamal haasan) కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఇండియన్ 2 (Indian 2). కమల్ హాసన్ అంటేనే ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్. సినిమాపై కమల్ హాసన్ ఎంత డెడికేషన్ చూపిస్తాడో ఆయన నటించిన వైవిధ్యమైన పాత్రలు చూస్తే అర్థమవుతుంది. ఇండియన్ 2లో స్వాతంత్ర సమరయోధుడి పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఇండియన్ 2 విషయంలో కూడా వచ్చిన ఒక అప్డేట్ కమల్ హాసన్ ఎంత కమిట్మెంట్తో పనిచేస్తాడనేది మరోసారి రుజువు చేస్తోంది.
ఇంతకీ విషయమేంటంటే కథానుగుణంగా కమల్‌హాసన్ పాత్రకు ప్రోస్థటిక్ మేకప్ అవసరం. ఈ మేకప్‌ను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసేందుకు కమల్‌హాసన్ ఆహారం తీసుకోకుండా ఎక్కువగా జ్యూస్‌నే సేవిస్తున్నాడని యూనిట్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కమల్‌హాసన్ ఏదైనా నమిలితే ప్రోస్థటిక్ మేకప్ సులభంగా రాలిపోయే ఛాన్స్ ఉండటంతో.. ఆకలిని ఓర్చుకుంటూ కేవలం పండ్లరసాల మీదే షూటింగ్లో చేస్తున్నాడట కమల్.
కమల్‌హాసన్ ఎంత డెడికేషన్ ఉన్న నటుడో చెప్పేందుకు మరోసారి లైమ్ లైట్లోకి వచ్చిన ఈ ఒక్క ఉదాహరణ చాలు. శంకర్ మరోవైపు రాంచరణ్‌తో ఆర్సీ 15 కూడా షూట్ చేస్తున్నాడు. ఈ స్టార్ డైరెక్టర్ ఓ వైపు ఇండియన్ 2 మరోవైపు ఆర్సీ 15 సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ.. షూటింగ్ కొనసాగిస్తున్నాడని తాజా అప్డేట్ తో అర్థమవుతుంది. ఇండియన్ 2లో కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఇండియన్ 2 పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
Read Also : Avatar : The Way Of Water | తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 రెస్పాన్స్ ఎలా ఉందంటే.. ?
Read Also : Dil Raju | వారసుడు ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదట.. ఇంతకీ ఎవరో చెప్పిన దిల్ రాజు
Read Also : Venkatesh | వెంకటేశ్‌ను ఇంప్రెస్ చేయలేకపోతున్న డైరెక్టర్లు.. స్టోరీ రైటర్ కావాలట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

