కెరీర్ మొదట్లో వరస విజయాలు అందుకున్నాడు అల్లు అర్జున్ (Allu Arjun). ఇంకా చెప్పాలంటే గంగోత్రి, ఆర్య, బన్నీ సినిమాలతో హ్యాట్రిక్ కూడా కొట్టాడు. అయితే ఆ తర్వాత మాత్రం కెరీర్ అనుకున్నట్లుగా సాగలేదు. హ్యాపీ నిరాశ పరిచింది. పరుగు యావరేజ్ గానే ఆడింది.. దేశముదురు ఒక్కటే కమర్షియల్ సక్సెస్ అయింది. ఆ వెంటనే భారీ అంచనాలతో వచ్చిన వరుడు, వేదం సినిమాలు పూర్తిగా నిరాశ పరిచాయి. మరో మగధీర అవుతుందనుకున్న బద్రీనాథ్ కూడా దారుణంగా నిరాశ పరిచింది. అలాంటి సమయంలో అల్లు అర్జున్ కెరీర్ నిలబడాలన్నా..మునపటి వేగం అందుకోవాలన్నా ఏదైనా మ్యాజిక్ జరగాలి.
ఆ మ్యాజిక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) చేసాడు. 2012లో తొలిసారి ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా జులాయి (Julayi). 2012, ఆగస్ట్ 9న విడుదలైన ఈ సినిమా 9 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇలియానాకు తెలుగులో చివరి హిట్ ఇదే. ట్రిపుల్ ఆర్ సినిమాను నిర్మిస్తున్న డివివి దానయ్య, హారిక హాసిని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మరి జులాయి అప్పట్లో వసూలు చేసిన మొత్తం ఎంతో చూద్దాం..
నైజాం: 11.25 కోట్లు
సీడెడ్: 6.20 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.80 కోట్లు
ఈస్ట్: 2.30 కోట్లు
వెస్ట్: 1.86 కోట్లు
గుంటూరు: 3.12 కోట్లు
కృష్ణా: 1.99 కోట్లు
నెల్లూరు: 1.43 కోట్లు
ఏపీ + తెలంగాణ: 31.95 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 3.85 కోట్లు
మలయాళం వెర్షన్: 2.65 కోట్లు
ఓవర్సీస్: 4.20 కోట్లు
వరల్డ్ వైడ్: 42.65 కోట్లు
బద్రీనాథ్ సినిమా ఫ్లాప్ అయినా కూడా 30 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. దాంతో ‘జులాయి’ చిత్రానికి రూ.33.79 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. భారీ అంచనాలతోనే వచ్చిన ఈ చిత్రం తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫుల్ రన్ అయ్యేసరికి రూ.42.65 కోట్ల షేర్ వసూలు చేసింది. అల్లు అర్జున్ కెరీర్ లో తొలి 40 కోట్ల సినిమా ఇదే. ఈ సినిమాతో బన్నీ మార్కెట్ కూడా భారీగానే పెరిగిపోయింది.
ఇవి కూడా చదవండి..
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
శృతి హాసMahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?