స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా తన టీం మెంబర్స్ కోసం (Allu Arjun team members).టైం కేటాయించేందుకు రెడీగా ఉంటాడు. తన సక్సెస్‌లో భాగమయ్యే టీం మెంబర్స్ ఆహ్వానానికి ఎప్పుడూ వెల్కమ్ చెబుతుంటాడు బన్నీ. ఈ ఐకాన్ స్టార్ తన టీం మెంబర్లో ఒకడైన శరత్ పుట్టినరోజు వేడుకల (Sharath birthday celebrations ) కు హాజరయ్యాడు. తమ బాస్ రాకతో ఆనందంలో మునిగిపోయాడు శరత్.
పుష్ప 2 కోసం రెడీ అవుతున్న అల్లు అర్జున్ బిజీగా ఉన్నప్పటికీ ఇటీవలే తన మేనేజర్ మనోజ్ వెడ్డింగ్‌కు కూడా హాజరై..వధూవరులిద్దరినీ ఆశీర్వదించాడు. మరోవైపు పీఆర్వో ఏలూరు శీను వివాహానికి కూడా వెళ్లాడు. చాలా మంది తెలుగు హీరోల్లో తమ కోసం పనిచేసే సిబ్బంది వ్యక్తిగత కార్యక్రమాలకు వెళ్లినా, వెళ్లకున్నా..అల్లు అర్జున్ మాత్రం తన సిబ్బందికి టైం కేటాయించడంలో ఎప్పుడూ రెడీగా ఉంటాడనడానికి బన్నీ హాజరవుతున్న ఈవెంట్స్ నే ఉదాహరణగా చెప్పొచ్చు.
సుకుమార్ డైరెక్షన్లో పుష్ప..ది రైజ్ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న బన్నీ పుష్ప 2 (Pushpa 2)కోసం రెడీ అవుతున్నాడు. ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కానున్నట్టు టాక్.