Nagarjuna Bike Stunts | ఎడారిలో డూప్స్ లేకుండా నాగార్జున బైక్ స్టంట్స్..!
హాట్ సమ్మర్ లో బైక్ స్టంట్స్ (Bike Stunts) చేస్తున్నారు నాగార్జున. ఆయన నటిస్తున్న కొత్త సినిమా ఘోస్ట్ యాక్షన్ సీక్వెన్సుల కోసం ప్రస్తుతం దుబాయ్ లోని డిసెర్ట్ సఫారీలో నాగార్జున ఫైటర్స్ తో కలిసి స్టంట్స్ చిత్రీకరిస్తున్నారు.
సమ్మర్ మొదలైంది. ఇక్కడే ఎండలు ఇలా ఉంటే ఎడారిలో ఎంత వేడి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలాంటి హాట్ సమ్మర్ లో బైక్ స్టంట్స్ (Bike Stunts) చేస్తున్నారు నాగార్జున. ఆయన నటిస్తున్న కొత్త సినిమా ఘోస్ట్ యాక్షన్ సీక్వెన్సుల షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం దుబాయ్ లోని డిసెర్ట్ సఫారీలో నాగార్జున ఫైటర్స్ తో కలిసి స్టంట్స్ చిత్రీకరిస్తున్నారు.
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 62 ఏళ్ల వయసులో నాగార్జున (Nagarjuna) ఈ స్టంట్స్ డూప్స్ లేకుండా చేయడం సర్ ప్రైజింగ్ గా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో ఘోస్ట్ (The Ghost) మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. సోనాల్ చౌహాన్ నాయికగా నటిస్తున్నది. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై నారాయణదాస్ కె నారంగ్, పూస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

దుబాయ్ లొకేషన్ నుంచి షూటింగ్ ఫొటోలను దర్శకుడు ప్రవీణ్ సత్తారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. యాక్షన్ లోడింగ్, యాష్ ట్యాగ్ ఘోస్ట్ అంటూ ట్వీట్ చేశారు. విలన్లను బైక్ మీద ఛేజ్ చేస్తూ వెళ్తున్న ఫొటోలు సినిమాలో యాక్షన్ సీన్స్ ఎంత ఆసక్తికరంగా ఉండబోతున్నాయో చూపిస్తున్నాయి.
Action Loading….#TheGhost #TheGhostDubaiDiaries pic.twitter.com/m9TsVdcYEh
— Praveen Sattaru (@PraveenSattaru) March 16, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

