నిన్ను కోరి, మజిలీ ఫేం శివ నిర్వాణ (Siva Nirvana) ప్రస్తుతం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత (Samantha)తో రొమాంటిక్ లవ్ స్టోరీని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ విషయం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ముందుగా అనుకున్న ప్రకారం మలయాళం కంపోజర్ గోపీసుందర్ (Gopisundar)ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోవాలి. గీతగోవిందం సినిమాకు బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ అందించిన గోపీసుందర్ అయితే చాలా బాగుంటుందని విజయ్ దేవరకొండ డైరెక్టర్ శివనిర్వాణకు సూచించాడట.
నిన్ను కోరి, టక్ జగదీష్ చిత్రాలకు ఇప్పటికే గోపీసుందర్‌తో పనిచేయడంతో శివనిర్వాణ కూడా ఈ కంపోజర్కే ఎక్కువ మొగ్గుచూపాడట. కానీ మధ్యలో సమంత వచ్చి పట్టుబట్టి మరీ వేరే మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకోవాలని చెప్పిందని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ కంపోజర్ ఎవరో కాదు..తెలుగు, తమిళ భాషల్లో మంచి ఆల్బమ్స్ ఇస్తున్న అనిరుధ్ రవిచందర్ (Anirudh). సమంత నటించిన కత్తి, ఓ బేబి సినిమాలకు హిట్ మ్యూజిక్ అందించాడు అనిరుధ్.
దీంతో సామ్ ఒత్తిడి మేరకు అనిరుధ్‌ను ఫైనల్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. కాగా ఈ సినిమాకు ఇప్పటికే ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నట్టు అనిరుధ్ చెప్పడంతో విజయ్-సామ్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్సయినట్టేనని తెలిసిపోతుంది. క్రియేటివ్ విషయాల్లో సమంత జోక్యం చేసుకోవడం మంచి ఫలితాలను అందిస్తే.. అంతా హ్యాపీగా ఫీలవుతారు..లేదంటే కొంత మరోసారి సామ్ మాటకు ఇంపార్టెన్స్ తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు సినీ జనాలు.
మరి సమంత రెఫరెన్స్ బాక్సాపీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది చూడాలి. గుణశేఖర్ డైరెక్షన్లో చేసిన శాకుంతలం షూటింగ్ పూర్తయింది. మరో ఫీ మేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ యశోదలో టైటిల్ రోల్ చేస్తోంది.