Sandeep Reddy Vanga | అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమనే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేశాడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). డైరెక్టర్‌గా తొలి ఎంట్రీతోనే బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపించాడు. ఇదే సినిమాను హిందీలో కబీర్‌సింగ్ పేరుతో రీమేక్ చేసి మంచి పాపులారిటీ సంపాదించాడు సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం రణ్ బీర్‌కపూర్ హీరోగా యానిమల్ సినిమా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా.
యానిమల్తో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించడం ఖాయమనిపిస్తోంది. ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌కు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను టార్గెట్ చేశాడు. పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో స్టార్ డమ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ (Allu Arjun)తో పాన్ ఇండియా సినిమా ప్రకటించాడు. భూషణ్ కుమార్ టీ సిరీస్, సందీప్ హోం బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ 2025లో సెట్స్ పైకి వెళ్లనుంది.
AA23 ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ ప్రాజెక్టులో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల గురించి రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న పుష్ప.. ది రూల్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే పనిపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే లీకైన రణ్‌బీర్‌కపూర్ యానిమల్ స్టిల్స్ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశాయి.
MASSIVE! Three powerhouses of India, Icon Star @alluarjun, producer #BhushanKumar & director @imvangasandeep join forces. The movie under this association will be produced by @TSeries & #BhadrakaliPictures.#KrishanKumar @vangapranay @vangapictures #ShivChanana @neerajkalyan_24 pic.twitter.com/bUhXo6o8QN
— BA Raju's Team (@baraju_SuperHit) March 3, 2023
Gopichand 31 | రూటు మార్చిన గోపీచంద్.. ఈ సారి కన్నడ డైరెక్టర్‌తో కొత్త సినిమా
Venkatesh | వెబ్ షోకు పనిచేయడం చాలా డిఫరెంట్.. వెంకటేశ్ చిట్ చాట్
Custody | స్టన్నింగ్‌గా మరో ఫస్ట్ లుక్.. కస్టడీలో అరవింద్ స్వామి
Allu arjun | అల్లు అర్జున్ అరుదైన రికార్డు.. సౌత్ నుంచి తొలి నటుడిగా..